KKR vs RCB: నేటి నుంచే ఐపీఎల్.. వర్షం పడితే కోల్ కతా బెంగళూరు మ్యాచ్ పరిస్థితి ఏంటి ?

KKR vs RCB: క్రికెట్ ప్రియులకు నేటి నుంచి మరో పండుగ మొదలు కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది.

Update: 2025-03-22 07:35 GMT

KKR vs RCB: నేటి నుంచే ఐపీఎల్.. వర్షం పడితే కోల్ కతా బెంగళూరు మ్యాచ్ పరిస్థితి ఏంటి ?

KKR vs RCB: క్రికెట్ ప్రియులకు నేటి నుంచి మరో పండుగ మొదలు కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కొన్ని ప్రత్యేక రూల్స్ వచ్చాయి. వీటిని అన్ని జట్లు, ఆటగాళ్ళు పాటించాల్సి ఉంటుంది. బిసిసిఐ ఈ నియమాలను కూడా ప్రకటించింది. వీటిలో లాలాజల వాడకంపై నిషేధాన్ని తొలగించడం, రెండవ ఇన్నింగ్స్‌లో రెండు బంతులను ఉపయోగించడం వంటి కొత్త నియమాలు ఉన్నాయి. కానీ కొన్ని నియమాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మ్యాచ్‌ల టైం పిరియడ్ , ఎక్స్ ట్రా టైంకి సంబంధించి.

ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. సీజన్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ పై వర్షం ముప్పు పొంచి ఉంది. శుక్రవారం కోల్‌కతాలో వర్షం పడింది. శనివారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇది మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు.

ఇప్పుడు ప్రతి సంవత్సరం ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లు వర్షం వల్ల క్యాన్సిల్ అవుతాయి. ఈ సంవత్సరం కూడా అదే జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ దీని కోసం ఎలాంటి నిబంధనలు రూపొందించిందో తెలుసుకుందాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. లీగ్ దశ మ్యాచ్‌లలో ఒక గంట ఎక్స్ ట్రా టైం ఇస్తారు. ఏదైనా అంతరాయం లేదా ఆలస్యం జరిగినా కూడా మ్యాచ్ పూర్తి చేస్తామని నిర్ధారించడం దీని ఉద్దేశ్యం.

కట్-ఆఫ్ సమయం: T20 క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఏదైనా మ్యాచ్‌లో ఫలితం సాధించాలంటే కనీసం 5 ఓవర్లు ఆడాలి. ఏదైనా కారణం చేత ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్ ఆలస్యం అయితే, 5 ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ సమయం రాత్రి 10:56 గంటలకు నిర్ణయించారు.అంటే ఈ సమయానికి ఆట ప్రారంభం కావాలి.

ఎక్స్ ట్రా టైం : ఐపీఎల్‌లో సాయంత్రం మ్యాచ్‌ల ప్రారంభ సమయం రాత్రి 7.30 గంటలకు.. షెడ్యూల్ ప్రకారం, అది రాత్రి 11 గంటలకు ముగియాలి. కానీ వర్షం పడితే, మ్యాచ్‌ను ఎలాగైనా అర్ధరాత్రి 12:06 గంటలలోపు పూర్తి చేయాలి. నిర్ణీత సమయంలో మ్యాచ్ పూర్తి కాకపోతే అంపైర్లు, మ్యాచ్ రిఫరీ తగిన నిర్ణయం తీసుకుంటారు.

వర్షం, వెలుతురు లేకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే, ఓవర్ల సంఖ్యను తగ్గిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంఖ్య ఇన్నింగ్స్‌కు 5 ఓవర్ల కంటే తక్కువగా ఉండకూడదు. ఓవర్లు తగ్గించినట్లయితే, డక్‌వర్త్ లూయిస్ నియమం (DLS) ఉపయోగిస్తారు. అయితే, ఎక్స్ ట్రా టైం ఉద్దేశ్యం ఏమిటంటే, మ్యాచ్ పూర్తి అయ్యేలా చూడటం.

Tags:    

Similar News