సెంచరీ తర్వాత.. ముందు 20 పరుగులు చేయి చాలు

భారత క్రికెట్ జట్టు వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్‌ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ పలుమార్లు అతనికి మద్దతుగా నిలిచాడు.

Update: 2020-02-03 13:00 GMT

భారత క్రికెట్ జట్టు వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్‌ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ పలుమార్లు అతనికి మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు పాలైయ్యాడు. కాగా..అతన్ని స్థానంలో రాహుల్‌కే వికెట్ కీపింగ్ బాద్యాతలు అప్పగించిన సంగతి తెలిసిందే. మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పంత్‌కు పలు సూచనలు చేశారు.

పంత్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న కపిల్, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంత్ ముందుగా 20 పైబడి పరుగులు చేయటానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. సెంచరీ గురించి తర్వాత ఆలోచించాలని తెలిపారు. వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు కేఎల్‌ రాహుల్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. స్పెసలిస్ట్ వికెట్‌ కీపర్‌ జట్టుకు అవసరం అన్నారు.

రిషబ్ పంత్‌ తన ప్రదర్శనతోనే విమర్శకులకు సమాధానం ఇవ్వాలని, శతకాలు సాధించాలనుకుంటే ముందుగా 20 పరుగులు చేయాలన్నారు. ఆ తర్వాత 20, 30, 50, 70 చేస్తూ సెంచరీ ప్రయత్నం చేయాలని గతంలో గవాస్కర్ చెప్పేవాడని తెలిపారు. 5-10 మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయడమే లక్ష్యంగా చూసుకోవాలని అన్నారు. పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసిన ప్రదర్శన బాగుడాలని కపిల్ దేశ్ చెప్పారు. ధోని పునరాగమనంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని ముందు ఐపీఎల్ కూడా ఉందని , ధోని తిరిగి ఆడాలా వద్దా అనేది తన నిర్ణయం అన్నారు. ఫిట్ నెస్ చాలా ముఖ్యమని, ఏడు నెలలు ధోని క్రికెట్ కు దూరంగా ఉన్నాడని కపిల్ గుర్తు చేశారు.  

Tags:    

Similar News