IPL Schedule: శివలాల్‌యాదవ్‌,‌ అజహారుద్దీన్ మధ్య మాటల యుద్ధం ‌

IPL Schedule: హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్‌యాదవ్.. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్‌ అజహారుద్దీన్‌ల మధ్య మాటల యుద్ధం

Update: 2021-03-10 08:19 GMT

ఇమేజ్ సోర్స్: క్రికెట్ కౌంటీ.కం

IPL Schedule: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్‌యాదవ్‌.. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్‌ అజహారుద్దీన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగతోంది. ఇటీవల విడుదల చేసిన ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ లో హైదరాబాద్ లేకపోవడంపై హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఉప్పల్ స్టేడియానికి చోటు దక్కకపోవడం హెచ్‌సీఏకే సిగ్గుచేటని దుమ్మెత్తిపోశాడు. హెచ్‌సీఏకు ఇది సిగ్గుచేటు అని ధ్వజమెత్తాడు. క్రికెట్‌ నిర్వహణకు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ దగ్గర సమయం లేకపోతే తక్షణం తప్పుకోవాలని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అజహరుద్దీన్‌ మండిపడ్డాడు. హెచ్‌సీఏలో 24 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసిన శివలాల్‌ క్రికెట్‌ అభివృద్ధికి ఏం చేశాడని జింఖానా మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించాడు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరాడు. శివలాల్‌, అజహర్‌ మాటల యుద్ధంతో హెచ్‌సీఏ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

హెచ్‌సీఏకు ఏం చేశాడు...

ఇన్ని మాటలు మాట్లాడుతున్న శివలాల్ యాదవ్ 24 ఏళ్లపాటు హెచ్‌సీఏలో వివిధ పదవులు అనుభవించాడని, ఈ కాలంలో హెచ్‌సీఏకు ఏం చేశాడని అజార్ ప్రశ్నించాడు. ఎంతమంది క్రికెటర్లను తయారుచేశాడని నిలదీశాడు. హెచ్‌సీఏకు వచ్చిన రూ. 200 కోట్లను ఏం చేశాడన్నాడు. ప్రతి క్రికెట్ సంఘం ఖాతాలోనూ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు ఉంటే హెచ్‌సీఏలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హెచ్‌సీఏ అవినీతిపై బీసీసీఐలో ప్రశ్నించినప్పుడు తలదించుకోవాల్సి వచ్చిందని అజర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తామెందుకు రాజీనామా చేయాలి...

మూడేళ్ల కాలానికి ఎన్నికైన తామెందుకు రాజీనామా చేయాలని అజారుద్దీన్ ప్రశ్నించాడు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై బీసీసీఐ, దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తానని, విచారణకు ఆయన సిద్ధమేనా? అని సవాలు విసిరాడు. తన వద్ద ఏమీ మంత్రదండం లేదని అజర్ స్పష్టం చేశాడు.

Tags:    

Similar News