IPL 2020: బ్యాటింగ్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యంతోనే ఓట‌మి: డేవిడ్ వార్న‌ర్

IPL 2020: యూఏఈ వేదికగా జ‌రుగుతున్న‌ ఐపీఎల్ 2020లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌, చెన్నై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్దేశించిన ఓవ‌ర్ల‌లో 168 పరుగులు చేసింది.

Update: 2020-10-14 06:24 GMT

IPL 2020: బ్యాటింగ్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యంతోనే ఓట‌మి: డేవిడ్ వార్న‌ర్

IPL 2020: యూఏఈ వేదికగా జ‌రుగుతున్న‌ ఐపీఎల్ 2020లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌, చెన్నై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్దేశించిన ఓవ‌ర్ల‌లో 168 పరుగులు చేసింది. ల‌క్ష్య‌చేధ‌న‌కు దిగిన హైదరాబాద్ త‌డ‌బ‌డింది. కేవ‌లం ‌ 147 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై 20 ప‌రుగులు తేడాతో విజ‌య‌కేతాన్ని ఎగ‌ర‌వేసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కేవ‌లం మూడింట మాత్ర‌మే గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్‌ ఆశలు సన్నగిల్లాయి.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్‌ తమకు మరో బ్యాట్స్‌మెన్‌ అవసరం ఉందని అన్నారు. బౌలింగ్ విభాగంలో ప‌టిష్టంలో ఉన్న‌ప్ప‌టికీ బ్యాటింగ్ లో విఫ‌లమ‌వుతున్న‌మ‌ని తెలిపారు. తమ జట్టు లోపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించారు. బౌండరీలు బాదాలని ప్రయత్నించాం. కానీ స్లో వికెట్ కావడం వల్ల సాధ్యం కాలేదన్నాడు. మా జట్టులో మరో బ్యాట్స్‌మన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. స్లో వికెట్ మీద బౌండరీలు కొట్టడం అంత తేలిక కాదు. స్వింగ్ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. చెన్నై స్వింగ్ బౌలర్లు మాకు అడ్డుకట్ట వేసి పరుగులు నియంత్రించారు.

జట్టులో ఏడుగురు బౌలర్లు ఉంటే ఎప్పుడూ మేలు చేస్తుందని చెన్నై జట్టును ఉద్దేశిస్తూ వార్నర్‌ మాట్లాడారు. బౌలర్లు రెండు వైపులా స్వింగ్ చేస్తున్నప్పుడు పవర్‌ప్లేలో పరుగులు చేయటం కష్టమని వివరించారు. హైదరాబాద్‌ జట్టు విలియమ్సన్‌, బెయిర్‌ స్టో మినహా మిగతావారు ఎవ్వ‌రూ బ్యాటింగ్ లో విఫ‌ల‌మవుతున్నారని చెప్పుకోచ్చారు.

Tags:    

Similar News