IPl 2020: క్రికెట్ అభిమానులకు నిరాశ.. ఐపీఎల్ రద్దు

కరోనా వైరస్ నేపథ్యంలో తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ -13 రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Update: 2020-03-30 04:42 GMT

కరోనా వైరస్ నేపథ్యంలో తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ -13 రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, దేశంలో కోవిడ్ కేసులు పెరుగతున్నా నేపథ్యంలో ఏప్రిల్ 15కు టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ మొదట ప్రకటించింది. అయితే, అప్పటికి కూడా దేశంలో పరిస్థితులు కుదుటపడే అవకాశం లేకపవడంతో ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కేంద్రం ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.

ఒకవేళ ఏప్రిల్ 15 తర్వాత టోర్నీ‌ని నిర్వహించినా విదేశీ క్రికెటర్ల ను ఆయా దేశ క్రికెట్ బోర్డు లు వారిని పంపించే అవకాశం లేదు. ఇక స్టేడియంలో సామాజిక దూరం పాటించడం అసాధ్యం. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహింస్తే ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. దీంతో అవాంతరాల మధ్య టోర్నీని నిర్వహించడం కంటే రద్దు చేయడమే మంచిదని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. 

Tags:    

Similar News