విఫలమైన ఢిల్లీ టాపార్డర్.. ముంబై లక్ష్యం 157 పరుగులు!

దుబాయ్ వేదికగా ముంబై, ఢిల్లీ జట్లు మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 157 పరుగుల చేసింది. అయితే బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది..

Update: 2020-11-10 16:04 GMT

దుబాయ్ వేదికగా ముంబై, ఢిల్లీ జట్లు మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఏడూ వికెట్ల నష్టానికి 157 పరుగుల చేసింది. అయితే బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.. ఓపెనర్ స్టాయినిస్‌ డకౌట్ అయ్యాడు.. బౌల్ట్ వేసిన మొదటి బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్టాయినిస్‌ వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. దీనితో ముంబై జట్టు 5 పరుగులకే మొదటి వికెట్ ని కోల్పోయింది. అయితే ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆ జట్టుకి మరో షాక్ తగిలింది..

బౌల్ట్ వేసిన మూడో ఓవర్ లోని మూడో బంతికి మరో ఓపెనర్ రహనే భారీ షాట్ కి ప్రయత్నించి వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. ఇక ఆ తరవాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్, శిఖర్ ధావన్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ ని పెంచారు. అయితే జయంత్ యాదవ్‌ బౌలింగ్ లో ధావన్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీనితో ఆ జట్టు 22 పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకపక్కా వికెట్లు పడుతున్న మరోపక్కా శ్రేయస్‌ అయ్యర్ మాత్రం నిలకడగా ఆడాడు.. అతనికి తోడుగా పంత్ కూడా నిలిచాడు.. దీనితో 8 ఓవర్లకు ఢిల్లీ జట్టు 50 పరుగులను దాటింది. ఆ తరవాత ఇద్దరు కలిసి ముంబై బౌలర్ల పైన విరుచుకపడ్డారు.. బౌండరీలతో హోరెత్తించారు.

అయితే 16 ఓవర్లలో కౌల్టర్‌నైల్‌ వేసిన ఆఖరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ (56) హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు. ఆ తర్వాత హెట్‌మైయర్ (5) కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు దీనితో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

Tags:    

Similar News