Ind vs SL : కాసేపట్లో భారత్ శ్రీలంక మధ్య టీ20 సమరం.. రోహిత్ దూరం

కాసేపట్లో భారత్ శ్రీలంక మధ్య పొట్టి సిరీస్ ఆరంభంకానుంది. ఇరు జట్లు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. జట్టులో కీలక ఆటగాడు రోహిత్ శర్మ, సినియర్ బౌలర్ ఈ సిరీస్ కు దూరం కానున్నారు.

Update: 2020-01-05 10:56 GMT
India vs Sri Lanka 1st T20

కొత్త సంవత్సరంలో భాతర జట్టు మైదానంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ ఉండడంతో భారత్ పొట్టి ఫార్మాట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాదిలో టీమిండియా అడనున్న తొలి సిరీస్ ఇదే. కాగా..గువాహటి వేదికగా టీమిండియా శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సీరిస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ‌ప్రారంభం కానుంది. గత సంవత్సరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టీండీస్ పై వరుస విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక జట్టు మాత్రం పాకిస్థాన్ పై జరిగిన టీ20 సిరీస్ లో విజయం సాధించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. ఈ సారి భారత్ పై రాణించి విజయంతో ఈ సంవత్సంలో ఆరంభించాలని మలింగసేన యోచిస్తుంది.

భారత జట్టు మాత్రం కొంత కాలంగా కీలక ఆటగాళ్లు పలు సిరిస్ నుంచి విశ్రాంతి ఇస్తుంది. తాజాగా శ్రీలంక సిరీస్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది. ఈ సారి రోహిత్ బదులుగా శిఖర్ ధావన్ బరిలో దిగనున్నాడు. మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్ శిఖర్ ధావన్ కు అగ్ని పరీక్షగా మారనుంది. టీమిండియా స్పిడ్ గన్ బుమ్రా మళ్లి జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో గాయపడిన బుమ్రా వన్డే, టీ20 సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. తాజా సిరీస్ లో బుమ్రా జట్టులోకి రానున్నాడు.

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే జట్టులో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ లేకపోయినప్పటీకి, రాహుల్ వరుస సిరీస్లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ ఓపెనర్ గా భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడంతో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా సెంచరీలతో అలరించాడు. తర్వాత కెప్టెన్ కోహ్లీ కూడా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో కోహ్లీ రికార్డు మెరుగ్గ లేకపోయినప్పటీకి గత ఏడాది టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. శ్రేయస్ప్ అయ్యార్. శివమ్ దూబే, జట్టు భారీ సోరు సాధించడంలో సహాయపడుతున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న రిషబ్ పంత్ వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో మళ్లి ఫామ్ లోకి వచ్చాడు. రెండో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు కీలక సమయంలో 71పరుగులు చేసి అయ్యార్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆలౌరౌండర్ జాడేజా కూడా తనకు అవకాశం వచ్చినప్పుడు బ్యాట్ తో రాణిస్తున్నాడు. క్లీష్ట సమయంలో ఒత్తిడికి‌లోను కాకుండా టేయిలేండర్లతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంతో జడేజా పాత్ర మరిచిపోలేనిది. శ్రీలంకతో జరిగే సిరీస్ లో కూడా భారత బ్యాట్స్ మెన్ రాణిస్తే పరుగల వరద పారించడం ఖాయం.

భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా పునరాగమనం పెద్ద బలం అనే చెప్పాలి. షమీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో స్టార్ బౌలర్ బుమ్రా జట్టులోకి రావడం బౌలింగ్ బలం మరింత పెరిగింది. అయితే బుమ్రా‌ఫిట్ నెస్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సామర్థ్యం నిరుపించుకునేందుకు సరైన సమయం అని చెప్పాలి. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ కూడా రాణిస్తున్నారు. అయితే విండీస్ పై జరిగిన సిరీస్ లో భారీగా పరుగులు సమర్పించుకోవడం కాస్త ఆందోళనకు గురిచేసే అంశమే.

శ్రీలంక జట్టు విషయానికి వస్తే ఆగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్ లో గెలవలేదు. టీమిండియాపై జరిగిన మ్యాచ్లో ధీటూగా ఎదుర్కొనలేకపోయింది. జట్టులో సీనియర్ ఆటగాడు మలింగను టి20లకు సారథిగా ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు. అయితే మలింగ కొంత కాలంగా ఫామ్ అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. వరసల సిరీస్ లు ఆడితే అతని కెప్టెన్సీలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. శ్రీలంక జట్టు పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై టి20 సిరీస్‌లో ఓడించింది. అయితే ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో గెలుపు సొంత చేసుకోలేకపోయింది. మలింగ, మాథ్యూస్‌పైనే భారం ఉంది. టీ20 జట్టులో చోటు పునరాగమనం చేసిన మాథ్యూస్‌ తమ ఉపకరిస్తుందని మలింగ అన్నాడు.

గత రెండు రోజులుగా వర్షం కురుస్తుంది. అయితే నేటి మ్యాచ్ వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో పిచ్ బ్యాటింగ్ అనుకూలం కావడంలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తది జట్ల అంచనా :

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌/ చహల్, శార్దుల్, బుమ్రా.

శ్రీలంక: లతీస్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్సా, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌, షనక, ఉడానా, హసరంగ, లహిరు కుమార/కసున్‌ రజిత.  

Tags:    

Similar News