IND vs NZ : న్యూజిలాండ్ సిరీస్ కి ముహూర్తం ఫిక్స్.. బీసీసీఐ లిస్టులో ఆ ఇద్దరు మొనగాళ్లు ఉన్నారా?

IND vs NZ : కొత్త ఏడాది వస్తోంది.. క్రికెట్ అభిమానుల్లో జోష్ పెరుగుతోంది. 2026 ప్రారంభంలోనే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.

Update: 2025-12-28 03:49 GMT

IND vs NZ : న్యూజిలాండ్ సిరీస్ కి ముహూర్తం ఫిక్స్.. బీసీసీఐ లిస్టులో ఆ ఇద్దరు మొనగాళ్లు ఉన్నారా?

IND vs NZ : కొత్త ఏడాది వస్తోంది.. క్రికెట్ అభిమానుల్లో జోష్ పెరుగుతోంది. 2026 ప్రారంభంలోనే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ, వన్డే జట్టు ఎంపికను మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంచింది. సిరీస్ ప్రారంభానికి కేవలం 14 రోజులే సమయం ఉండటంతో సెలక్షన్ ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కొత్త ఏడాది తొలి వారంలోనే దీనిపై క్లారిటీ రానుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4వ తేదీన వన్డే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి సెలక్టర్లు నేరుగా సమావేశం కాకుండా ఆన్‌లైన్ ద్వారా మీటింగ్ నిర్వహించబోతున్నారట. అంటే ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుండానే, గతంలో లాగే బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా నేరుగా జట్టు సభ్యుల పేర్లను వెల్లడించనుంది. ఈ సిరీస్ శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 కంటే ముందు జరగనున్న కీలకమైన టోర్నీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మళ్ళీ మైదానంలో చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. గత రెండు నెలలుగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లలో వీరు దుమ్మురేపారు. ఇప్పుడు కివీస్‌పై కూడా తమ ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమవుతున్నారు. ఈ సీనియర్ల రాకతో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారనుంది. అయితే సెలక్టర్లు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? లేదా సీనియర్లనే కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ సిరీస్ సెలక్షన్‌లో అందరి కళ్లు టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పైనే ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్, గత కొద్ది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం ఫ్యాన్స్‌కు ఊరటనిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న అయ్యర్‌కు సెలక్టర్లు అవకాశం ఇస్తారా? లేదా పూర్తిగా ఫిట్ అయ్యే వరకు విశ్రాంతినిస్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News