India Vs Bangladesh 2nd T20: బంగ్లా స్కోరు 153/6

Update: 2019-11-07 15:18 GMT

గుజరాత్ లోని రాజ్‌ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నమ్యాచ్ లో  బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 153/6 కోల్పోయింది.భారత్, బంగ్లా జట్ల మధ్య రెండో 20లో మొదట టాస్ గెలిచిన భారత్ బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు లిప్టన్ దాస్, ఓపెనర్ మహ్మద్ నయిమ్ కీలక భాగస్వామ్యం నెలకొప్పారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు ఏడు ఓవర్లలో 60పరుగుల భాగస్వామన్యం నమోదు చేశారు.ఈక్రమంలో దాస్‌ను 7.2 ఓవర్ల వద్ద పంత్ రనౌట్ చేశాడు.

లిప్టన్ దాస్ 21బంతులు ఎదుర్కొని 29పరుగులు సాధించాడు. దీంతో ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఇక మరో ఓపెనర్ మహ్మాద్ నయిమ్ (36)ని సుందర్ బౌలింగ్‌లో శ్రేయస్స్ అయ్యార్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. 10.3 ఓవర్లలో బంగ్లా జట్టు 83/2 వికెట్టు కోల్పోయింది. సౌమ్యసర్కార్ ధాటిగా ఆడాడు కేవలం 20 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు ఫోర్లు ఒక సిక్సర్ లో 30 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీం నాలుగు పరుగులకే అవుటయ్యారు. ప్రమదకర ఇన్నింగ్స్ అడుతున్న సౌమ్య సర్కార్‌ను చాహల్ పెవిలియన్ బాటపట్టించాడు. 12.6 ఓవర్లకు బంగ్లా జట్టు 103 పరుగుల చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన మహ్మదుల్లా (కెప్టెన్ ) 30( 21 బంతుల్లో 4X4 )రాణించాడు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశారు, ఆహ్మద్, వాషిగ్టన్ సుందర్, దీపక్ తల ఓ వికెట్ దక్కించుకున్నారు.



Tags:    

Similar News