India Vs NewZealand: భారత్ తడబ్యాటు.. కివీస్ విజయలక్ష్యం 166 పరుగులు

ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా నాలుగొవ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలబడుతున్నాయి.

Update: 2020-01-31 09:03 GMT

ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా నాలుగొవ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ ప్రారంభించిన భరత్ జట్టుకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన సంజూసామ్సన్ (8) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్కాట్ బౌలింగ్ లో అవుట్ య్యాడు.

తరువాత క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) పరుగు వద్ద హామిష్ బెన్నెట్ బౌలింగ్ లో సన్తనేర్ కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాట పట్టదు. వెంటనే శ్రేయాస్ అయ్యార్ (1) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సోది బౌలింగ్ లో అవుట్ య్యాడు. ఇలా వెంట వెంటనే వికెట్లు కోల్పోతున్న తరుణంలో కే ఎల్ రాహుల్ నిలకడగా ఆడాడు. జట్టు స్కోర్ 69 పరుగులు ఉన్నపుడు కే ఎల్ రాహుల్ (39) పరుగులు చేసి సోది బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

ఈ క్రమంలోనే భరత్ జట్టు ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా మనీష్ పాండే, ఠాకూర్ కలిసి జట్టు స్కోర్ వేగం పెంచారు. కొద్దిసేపటికే ఠాకూర్ అవుట్ అవ్వటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలోనే మనీష్ పాండే తనదైన రీతిలో ఆది జట్టు స్కోర్ వేగాన్ని పెంచాడు. చివరికి 20 ఓవర్లు పూర్తి ఐయ్యే సమయానికి మణిశపాండే(50) పరుగులు పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు లో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది.  

Tags:    

Similar News