బంగ్లా ప్లేయర్ల ఓవ‌రాక్షన్.. భార‌త ప్లేయ‌ర్లతో వాగ్యుద్ధం

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐసీసీ అండర్ -19 ప్రపంచ ‌కప్‌లో బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2020-02-10 10:51 GMT

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐసీసీ అండర్ -19 ప్రపంచ ‌కప్‌లో బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లా మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా.. బంగ్లాదేశ్ కు ఇదే తొటి వరల్డ్ కప్ టైటిల్ కావడం విశేషం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లా యువ ఆటగాళ్లల ప్రవ‌ర్తన‌పై సర్వాత్ర విమ‌ర్శలు వెల్లువెత్తున్నాయి.

బంగ్లా యువ జ‌ట్టు సినీయర్ ఆటగాళ్ల మాదిరి ప్రవ‌ర్తించారని తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లను రెచ్చగొడుతూ.. వాగ్యుద్ధానికి దిగారని తెలుస్తోంది. ఒక‌ద‌శ‌లో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఆగ్రహావేశాలకు లోనైయ్యారు. దీంతో అంపైర్లు కలుగజేసుకుని ప్లేయ‌ర్లను వారించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంత‌రం టీమిండియా అండర్ -19 జట్టు కెప్టెన్ ప్రియామ్ గార్గ్ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ ‌కప్‌లో ఓట‌మిని తాము తేలిక‌గానే తీసుకున్నామ‌ని, అయితే గెలిచిన తర్వాత బంగ్లా బౌల‌ర్లు దురుసుగా ఉత్సాహంలో ప్రవ‌ర్తించార‌ని తెలిపాడు. వారి రియాక్షన్ దర్టీగా ఉందని వెల్లడించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.


మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియ‌స్ గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వీడియోను ప‌రిశీలించి నివేదిక రూపొందించ‌మ‌ని అధికారులను ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై భార‌త టీమ్ మేనేజ‌ర్ అనిల్ ప‌టేల్‌కు మ్యాచ్ రిఫ‌రీ గ్రేమ్ లాబ్రూరీని క్షమ‌ప‌ణ‌లు చెప్పారు. ఈ ఘ‌ట‌న జ‌రిగాక రిఫ‌రీ స్వయంగా వ‌చ్చి, క్షమాపణ చెప్పార‌ని తెలిపారు. బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ తీవ్ర పరిగణిస్తుందని, సోమ‌వారం నాడు వారిపై కఠిన చర్యలు తీసుకోనుంద‌ని చెప్పిన‌ట్లు వెల్లడించాడు.

కాగా.. టీమిండియా‌, బంగ్లాదేశ్‌ అండర్ -19 జట్ల మధ్య జరిగిన అండర్ -19 ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 177 పరుగులకి అల్ అవుట్ అయింది. భారత బాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (88), తిలక్ వర్మ (38) రాణించారు. ఇక బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాన్ మూడు, షోరిపుల్‌ ఇస్లామ్, తన్జీమ్ హసన్‌ చేరు రెండు వికెట్లు తీశారు.

178 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 41 ఓవర్లలో మూడు వికెట్ల తేడా 163 పరుగులు చేసింది విజయం సాధించింది. అక్బర్ అలీ (42), రకీబుల్ హసన్ (3) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి 15 పరుగులు అవసరం ఉండగా. డర్క్ వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 24 బంతుల్లో 1 పరుగు‌గా చేశారు. దీంతో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెల్చింది. 

Tags:    

Similar News