నూజిలాండ్ లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఇవాళ అక్లాండ్ వేదికగా కివీస్‌తో రెండో వన్డేలో భారత్ తలపడుతోంది. సిరీస్ రేసులో నిలవాలంటే మ్యాచ్‌లో భారత్ తప్పక నెగ్గాల్సిన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ చెప్పాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అక్లాండ్ మైదానంలో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఉండటంతో కోహ్లీ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు.
భారత్ తుది జట్లు
పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్‌రాహుల్(వికెట్ కీపర్) , శ్రేయాస్ అయ్యర్, కేదార్ జాదవ్, జడేజా, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, చాహల్, బుమ్రా
న్యూజిలాండ్ తుది జట్టు
మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్, రాస్ టేలర్, టామ్ బ్లండెల్, మార్క్ చాపమన్, జేమ్స్ నీషమ్, గ్రాండ్‌హోం, జెమీసన్, టిమ్ సౌథీ, బెనెట్
Captain @imVkohli wins the toss and elects to bowl first in the 2nd ODI against New Zealand. pic.twitter.com/DYkaYSCyzy
— BCCI (@BCCI) February 8, 2020