IND vs NZ 2nd ODI : అయ్యో కివీస్.. టీమిండియా బౌలర్ల విజృంభణ

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 30 పరుగలు వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు.

Update: 2020-02-08 05:18 GMT
India Vs NZ 2nd Odi

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 30 పరుగలు వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కివీస్ 250 మార్క్ దాటడం కూడా కష్టమే. దీంతో 42 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఏనిమిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ గుప్తిల్(79,79బంతుల్లో, 8ఫోర్లు, 3 సిక్సుల) అర్థసెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ నికోలస్ 41 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇద్దరు కలిసి కివీస్‌కు శుభారంభాన్నించారు. తొలి వికెట్‌కు 93 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. 17 ఓవర్ బౌలింగ్ వచ్చిన చాహల్ వీరి జోడిని వీడతీశాడు. అర్థసెంచరీతో తర్వాత ధాటిగా ఆడుతున్న గుప్తిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 30 ఓవర్‌ అందుకున్న జడేజా వేసిన బంతిని రాస్‌ టేలర్‌ షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఆడాడు. సింగిల్‌కు రమ్మంటూ రాస్ టేలర్ గప్టిల్‌ను పిలిచాడు. సింగిల్ కోసం ప్రయత్నిస్తుండగా.. శార్దూల్‌ బంతిని అందుకుని వికెట్ కీపర్‌ రాహుల్‌ అందించాడు. రాహుల్‌ వికెట్లను గిరటావేశాడు. దీంతో గుప్తిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

తొలి వన్డే సెంచరీ హీరో రాస్ టేలర్ (42) పరుగులతో టైలెండర్ సాయంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. జెమీసన్‌,(2)పరుగలతో క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (7) జాడేజా ఎల్బీడబ్యూ చేశాడు. అనంతరం వచ్చిన కివీస్ బ్యాట్స్ మెన్స్ ఎవరు నిలదొక్కుకోలేదు. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీశాడు. శార్థుల్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. 



Tags:    

Similar News