IND vs NZ 1st ODI : వరుస విజయాలకు బ్రేక్

టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. మూడు వన్డేల సిరీస్ భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా పరాజయంపాలయ్యింది.

Update: 2020-02-05 10:31 GMT
IND vs NZ 1st ODI

టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. మూడు వన్డేల సిరీస్ భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా పరాజయంపాలయ్యింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ హిట్టర్ రాస్ టేలర్ ( 109 పరుగులు 84 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సు) అజేయంగా సెంచరీతో భారత బౌలర్లపై చెలరేగిపోయారు. అలాగే ఓపెనర్ హెన్రీ నికోల్స్ (78 పరుగులు 82 బంతుల్లో 11 ఫోర్ల), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టామ్ లాతం (69, 48 బంతుల్లో, 8X4, 2x6)తో రాణిచారు. దీంతో భారత్ విధించిన 348 పరుగుల విజయలక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో కూల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, శార్థుల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే ఈ నెల 8వ తేదీ శనివారం అక్లాండ్ వేదికగా జరగనుంది.

అంతకుముందు టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా ఓపెనర్లుగా అరంగేట్రం చేసిన మయాంక్, పృధ్వీషా శుభారంభాన్ని ఇచ్చారు. అయితే ఇద్దరు వరుసగా ఔట్ కావడంతో, శ్రేయాస్ అయ్యార్ (103,105 బంతుల్లో) సెంచరీ చేసి తన ఖాతాలో తొలి శతకం నమోదు చేశాడు. శ్రేయస్స్ అయ్యార్ కు, కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్ ,శ్రేయాస్ ఇయర్, జతకలవడంతో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. అర్ధ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 51(63) సోధీ బౌలింగ్లో పెవిలియన్ బాటపట్టారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఒన్డే లో 58వ అర్థ శతకాన్ని నమోదుచేసుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడుతూ శ్రేయాస్ ఐయేర్ సెంచరీ నమోదు తర్వాత వెంటనే సౌథీ బౌలింగ్ లో మిట్చెల్ సన్తంర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మరో వైపు కే ఎల్ రాహుల్ 88(64)తో, కేదార్ జాదవ్ 26(15)తో క్రీజులో ఉన్నారు. 50 ఓవర్లు మూగిసి సమయానికి టీం ఇండియా 347/4 పరుగులు చేసింది. మూడు వన్డేల సిరీస్ లో కివీస్ 1-0తో ముందంజలో ఉంది.



 

Tags:    

Similar News