ICC U19 WORLD CUP : పాక్‌ను ఆటాడుకున్న టీమిండియా.. తక్కువ స్కోరుకే పాక్ ఆలౌట్

స్వల్ప స్కోరుకే పాకిస్తాన్ అండర్ -19 జట్టును పరిమితం చేసిన భారత్

Update: 2020-02-04 12:26 GMT
పాక్‌ను ఆటాడుకున్న టీమిండియా

అండర్‌-19 ప్రపంచ కప్‌లో టీమిండియా పాక్ సెమీఫైనల్ జరుగుతోంది . ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన పాక్. భారత బౌలర్ల ధాటికి 43.1 ఓవరల్లో 172 పరుగులకే ఆలౌటైంది. భారత్ ముందు 173 పరుగులను విజయలక్ష్యంగా నిర్ధేశించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పాకిస్థాన్ జట్టును ఆడుకున్నారు. కెప్టెన్‌ రోహైల్‌ నాజిర్‌(62) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పెనర్ హైదర్ ఆలీ(56) పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో సుషాంత్‌ మిశ్రా 3 వికెట్ల పడగొట్టగా.. రవి బిష్ణోయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు తీశారు. అంకోల్కెర్‌, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15)‌, సక్సెనా(9)తో రాణిస్తున్నారు. దీంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 28 పరుగులు చేసింది.


  

Tags:    

Similar News