ICC U19 WORLD CUP : భారత్ చేతిలో పాక్ చిత్తు.. ఇలాంటి విక్టరీ నెవర్ బిఫోర్

అండర్‌-19 ప్రపంచ కప్‌లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించింది.

Update: 2020-02-04 14:43 GMT
India Vs Pakistan u-19 World Cup

అండర్‌-19 ప్రపంచ కప్‌లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించింది. పాక్ సెమీఫైనల్ ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ నిర్ధేశించిన 173 పరుగులను విజయలక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. భారత్ 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో పాక్‌ను జట్టును చిత్తుగా ఓడించింది. 173 పరుగులు విజయలక్ష్యంలో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. భారత్ పాక్ బౌలర్లను సమర్థవంతంగా భారత ఓపెనర్లు ఎదుర్కొన్నారు. యశస్వి జైస్వాల్ (105పరుగులు , 113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సత్తాచాటాడు. సక్సేనా ( 59పరుగులు, 99 బంతులు, 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్ పాకిస్థాన్ పై గెలవడం ఇది ఐదో సారి.

కాగా.. గురువారం బంగ్లాదేశ్‌ల -19, న్యూజిలాండ్ -19‌, జట్ల మధ్య రెండో సెమీస్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ పోరులో టీమిండియాపై తలపడనుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్ ఫిబ్రవరి 9(ఆదివారం) పాచెఫ్‌స్ట్రూమ్‌ జరగనుంది.

అంతకుముందు ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన పాక్. భారత బౌలర్ల ధాటికి 43.1 ఓవరల్లో 172 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభం నుంచే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పాకిస్థాన్ జట్టును ఆడుకున్నారు. కెప్టెన్‌ రోహైల్‌ నాజిర్‌(62) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పెనర్ హైదర్ ఆలీ(56) పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో సుషాంత్‌ మిశ్రా 3 వికెట్ల పడగొట్టగా.. రవి బిష్ణోయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు తీశారు. అంకోల్కెర్‌, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.




Tags:    

Similar News