పాకిస్తాన్ ఓపెనర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే /నైట్‌ టెస్టులో పాకిస్తాన్‌ జట్టు ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ ఘోరంగా విఫలమైయ్యాడు

Update: 2019-12-01 14:30 GMT
imam-ul-haq

 అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే /నైట్‌ టెస్టులో పాకిస్తాన్‌ జట్టు ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ ఘోరంగా విఫలమైయ్యాడు. దీంతో ఐస్ లాండ్ క్రికెట్ ఇమాముల్‌ హక్‌ ఆటగాడే కాదు అంటూ ఎద్దేవా చేసింది. అసలు పాకిస్థాన్ క్రికెట్ కు ఐస్ లాండ్ క్రికెట్ కు సంబంధం లేదు. కానీ ఐస్‌లాండ్‌ ఇమాముల్‌ హక్‌‌ను విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఈమ్యాచ్ లో ఇమాముల్‌ హక్‌ మొదటి ఇన్నింగ్స్ లో రెండు పరుగుల చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఖాతా తెరవకుండానే అవుటైయ్యాడు.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రెండు టెస్టుల్లో కలిపి 489 పరుగులు సాదించాడు. అందులో 154 పరుగుల్ని తొలి టెస్టులో సాదిస్తే, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 335 రికార్డు ట్రిపుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో వార్నర్ చేసిన పరుగుల కంటే ఇమాముల్‌ హక్‌ తన టెస్టు కెరీర్ సాధించిన పరుగులే తక్కువగా ఉన్నాయంటూ ఐస్ లాండ్ క్రికెట్ ట్విటర్‌లో ఎద్దేవా చేసింది. ఇమాముల్‌ హక్‌ 11 టెస్టు్ల్లో గాను 485 పరుగులు సాధించాడు.



Tags:    

Similar News