దేశం కోసం సాయం చేస్తున్నాం : హాకీ ఇండియా

క‌రోనా వైర‌స్ మహమ్మరిపై అరికెట్టేందుకు జరుగుతున్న పోరాటానికి క్రీడా లోకం ముందుకు వచ్చింది.

Update: 2020-04-01 09:55 GMT
Representational Image

క‌రోనా వైర‌స్ మహమ్మరిపై అరికెట్టేందుకు జరుగుతున్న పోరాటానికి క్రీడా లోకం ముందుకు వచ్చింది. హెచ్ఐ ఎగ్జిక్యూటివ్ స‌మావేశం అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. హాకీ ఇండియా (హెచ్ఐ) రూ. 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించింది.

ప్ర‌ధాని సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు బుధ‌వారం పేర్కొంది. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వానికి ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా నిలువాల్సిన అవ‌స‌రం ఉందని హాకీ ఇండియా అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ ముస్తాఖ్ అహ్మ‌ద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

దేశ ప్ర‌జ‌లు హాకీకి ఎల్ల‌ప్పుడూ ఆదరించారని అలాంటి వారి కోసం ఈ చిన్ని సాయం చేస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త ప్ర‌భుత్వం క‌ష్ట‌కాలంలో చ‌క్క‌టి నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న‌ద‌ని అన్నారు. మోదీ సర్కారుకు ప్రతి ఒక్కరూ విరాళాల ఇవ్వాలని, బాధ్య‌తాయుత పౌరులుగా మ‌న‌మంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాను త‌రిమికొట్ట‌డంలో మ‌న‌వంతు కృషి చేయాలని,ప్రతి ఒక్కరూ స్వీయ నిర్భందం పాటించాలని ముస్తాఖ్ అహ్మ‌ద్ పిలుపు నిచ్చారు. 

Tags:    

Similar News