HCA Elections: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

HCA Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

Update: 2023-10-20 05:31 GMT

HCA Elections: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

HCA Elections: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికలకు రాజకీయ రంగు రుద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీగా ప్రచారం జరుగుతోంది. తమ ప్యానెల్‌కు ప్రభుత్వ మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు జగన్మోహనరావు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ ప్యానెల్ పేరుతో అనిల్ కుమార్ ప్యానెల్ పోటీలోకి దిగింది. అయితే HCA మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు అనిల్ కుమార్. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో శివలాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక అర్షద్ ఆయూబ్ ప్యానెల్ తరపున అధ్యక్షుడిగా అమర్‌నాథ్ పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News