Hardik Pandya: వామ్మో.. పాండ్యా అన్ని కోట్ల ఖరీదైన వాచ్ ధరించాడా? పాక్‌పై మ్యాచ్‌లో అదే వాచ్‌తో బరిలోకి దిగాడా?
Hardik Pandya: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. హార్దిక్ ఇన్నింగ్స్‌లో 2 పెద్ద వికెట్లు పడగొట్టాడు. కానీ అతని బౌలింగ్ కంటే, అతని మణికట్టుపై ఉన్న గడియారం మ్యాచ్‌లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీని ధర దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందట.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ తరఫున హార్దిక్ 8 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతని బౌలింగ్ కంటే, అతని మణికట్టు మీద కట్టుకున్న గడియారం గురించి చర్చ జరుగుతోంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లెకు చెందిన రాఫెల్ నాదల్ స్కెలిటన్ డయల్ ఎడిషన్. ఈ వాచ్ ధర గురించి తెలుసుకుంటే.. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఇంత ఖరీదైన వాచ్ ధరించడం ఇదే మొదటిసారి కాదు. అందుకే అభిమానులు హార్దిక్ పాండ్యా గడియారాన్ని తెరపై చూసిన వెంటనే, దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది.
లగ్జరీ బ్రాండ్ల అంటే ఇష్టపడే హార్దిక్.. రిచర్డ్ మిలీ ఆర్ఎం 27-02 వాచీని ధరించాడు. అమెరికా మార్కెట్‌లో దాని విలువ 8 లక్షల డాలర్లుగా ఉంటుంది. రిచర్డ్ మిలీ వాచీని కోటీశ్వర్లు కూడా ధరించడం అరుదే. నిజానికి ఈ వాచీని.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రఫేల్ నాదల్ కోసం డిజైన్ చేసినట్లు సమాచారం. కార్బన్ టీపీటీ యునీబాడీ బేస్‌ప్లేట్ ఈ వాచీ ప్రత్యేకత. దీంతో ఆ వాచీకి షాక్ రెసిస్టెన్స్, డ్యూరబులిటీ అధికంగా ఉంటాయి.
హార్దిక్ పాండ్యా పెట్టుకున్న రిచర్డ్ మిలీ వాచీ లాంటి వాచ్‌లు ఇప్పటి వరకు కేవలం 50 మాత్రమే ఉత్పతి చేసిందట కంపెనీ. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ కొత్త సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ వికెట్లను పాండ్యా పడగొట్టేశాడు. ఇద్దరూ మంచి టచ్‌లో ఉన్న సమయంలోనే వికెట్లను తీశాడు. 30.76 సగటుతో 200 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ అయ్యాడు హార్థిక పాండ్యా .