Harbhajan Singh: అతడు తప్పకుండా టీమిండియా కెప్టెన్ అవుతాడు..
Harbhajan Singh: ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Harbhajan Singh: అతడు తప్పకుండా టీమిండియా కెప్టెన్ అవుతాడు..
Harbhajan Singh: ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంటంగా సాగిన మ్యాచులో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అద్భుత విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. పాండ్యా తప్పకుండా తదుపరి టీమిండియా కెప్టెన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు.
పాండ్యా బ్యాటింగ్ మరో స్థాయిలో ఉంటుందని, గాయాల తర్వాత ఎంతోగానో శ్రమించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని భజ్జీ అన్నాడు. ఇప్పుడు పాండ్యాలో మరో కోణాన్ని మనం చూస్తున్నాం. ధోనీలా మారుతున్నాడు. చాలా కూల్‌గా, స్థిరంగా కన్పిస్తున్నాడు. బ్యాటింగ్ కూడా బాగుంది. మన సామర్థ్యంపై మనకు విశ్వాసం ఉన్నప్పుడే ఇలా మారగలం. టీమిండియాకు విజయం సాధించి తీరుతానన్న భరోసాతో కనబడుతున్నాడని, అతడు భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం త్వరలోనే చూస్తామని హర్భజన్ ప్రశంసించాడు.