Badminton: విష్ణు విశాల్‌తో పెళ్లి డేట్‌ అనౌన్స్‌ చేసిన గుత్తా జ్వాల

Badminton: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి.

Update: 2021-04-13 13:47 GMT

Badminton: విష్ణు విశాల్‌తో పెళ్లి డేట్‌ అనౌన్స్‌ చేసిన గుత్తా జ్వాల

Badminton: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఈనెల 22న పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రకటించారు. ఉగాది రోజున లగ్న పత్రికను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు విష్ణు విశాల్‌. దాంతో, అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని, అతికొద్దిమంది సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు విష్ణు విశాల్‌ వెల్లడించాడు. ఇన్నేళ్లుగా త‌మ‌పై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.


Tags:    

Similar News