England vs West Indies 2nd Test Day1 Highlights: రెండో టెస్టులో తెలిపోయిన విండిస్ బౌలర్లు!

England vs West Indies 2nd Test Day1 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం మొదలైన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో విండిస్ బౌలర్లు తేలిపోయారు.

Update: 2020-07-17 06:15 GMT
Eng vs WI

England vs West Indies 2nd Test Day1 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం మొదలైన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో విండిస్ బౌలర్లు తేలిపోయారు. మొదటి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి ఇంగ్లీష్ జట్టు గట్టిగానే గుణపాఠం నేర్చుకుంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగితే , ఇంగ్లాండ్ జట్టులో రూట్ వచ్చాడు. పేసర్లు ఆర్చర్, అండర్సన్, వుడ్ స్థానంలో సామ్ కరన్, వోక్స్, బ్రాడ్ జట్టులోకొచ్చారు.

ఇక మ్యాచ్ లో టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన విండిస్ జట్టు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో వర్షం పడడంతో ఆట కాస్తా ఆలస్యం అయింది. ఆ తర్వాత ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ ఎదురైంది. బర్న్స్ (15), క్రాలే (0) రూపంలో ఇంగ్లాండ్ జట్టు టకటక వికెట్లు కోల్పోయింది. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రూట్ (23), సిబ్లే (86) 4×4, బెన్ స్టోక్స్ (59 )4×4, 1×6 జట్టును ముందుకు నడిపించారు.

దీనితో టీ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 112/3తో నిలిచింది. ఇక టీ విరామం తర్వాత స్టోక్స్-సిబ్లే జోడీ నెమ్మదిగా ఆడింది. ఈ క్రమంలో సిబ్లే 164 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, స్టోక్స్ 119 బంతుల్లో 50 మార్క్ దాటాడు. దీనితో ఇంగ్లాండ్ జట్టు 150 పరుగుల స్కోర్ బోర్డుని దాటింది. ఇక ఆట చివర్లో ఇద్దరు కొంచం స్పీడ్ గా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు 200 మార్కును దాటింది. విండిస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికేట్లు తీయగా, జోసెఫ్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు ఇలాగే తన ఆటను కొనసాగిస్తే మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News