England vs West Indies 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ

ENG vs WI 2nd Test, Day 5 Highlights: సౌథాంప్టన్‌ టెస్ట్ లో ఘోర ఓటమి పాలు అయిన ఇంగ్లాండ్ జట్టు .. మాంచెస్టర్‌ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అందుకు ప్రతీకారం తీర్చుకుంది.

Update: 2020-07-21 06:47 GMT
England vs West Indies 2nd Test highlights

ENG vs WI 2nd Test, Day 5 Highlights: సౌథాంప్టన్‌ టెస్ట్ లో ఘోర ఓటమి పాలు అయిన ఇంగ్లాండ్ జట్టు .. మాంచెస్టర్‌ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అందుకు ప్రతీకారం తీర్చుకుంది. రెండో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యాన్ని విండిస్ ముందు ఉంచి ఆ జట్టును తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక మిగిలిన చివరి టెస్ట్ మాంచెస్టర్‌లోనే శుక్రవారం మొదలవుతుంది.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 37/2తో ఐదో రోజు బ్యాటింగ్‌ ని మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌ జట్టు మూడు వికెట్లను కోల్పోయి 129 పరుగులు సాదించి డిక్లేర్‌ చేసింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కిన బెన్‌ స్టోక్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 78 పరుగులు (4×4, 3×6) చేశారు. ఇక ఆ తర్వాత 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ జట్టు కేవలం 198 పరుగులకే ఆలౌట్‌ అయిపోయింది.

విండిస్ జట్టులో షర్మా బ్రూక్స్‌ (62; 136 బంతుల్లో 4×4, 2×6), బ్లాక్‌వుడ్‌ (55; 88 బంతుల్లో 7×4), హోల్డర్‌ (35; 62 బంతుల్లో 5×4, 1×6) పరుగులు చేసి జట్టుకి ఆ మాత్రం స్కోర్ ని సాధించిపెట్టాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ అదరగొట్టాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/42), క్రిస్‌ వోక్స్‌ (2/34), బెన్‌ స్టోక్స్‌ (2/30), బెస్‌ (2/59) వికెట్లు తీశారు. ఇక మొత్తం మ్యాచ్ లో కీ రోల్ పోషించిన స్టోక్స్‌నే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు వరించింది.

Tags:    

Similar News