ENG vs AFG: లాహోర్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది.. టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్ నిష్ర్కమిస్తుందా ?
ENG vs AFG: బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత..ఇంగ్లాండ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ENG vs AFG: లాహోర్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది.. టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్ నిష్ర్కమిస్తుందా ?
ENG vs AFG: బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత..ఇంగ్లాండ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి వైదలగాయి. మరోవైపు, ఇంగ్లాండ్ మరో ఓటమిని ఎదుర్కొంటే సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు క్లోజ్ అవుతాయి. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడనుంది. 16 నెలల నాటి 'ఆట'రిపీట్ అవుతుందా..లేదా ఏదైనా మ్యాజిక్ పునరావృతం అవుతుందా చూడాలి.
గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ , ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లను గెలిచాయి. వాటి రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 25న జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా అది రద్దయింది. రెండు జట్లు ఒక్కొక్క విజయంతో ప్రస్తుతం టోర్నెమెంట్ లో స్ట్రాంగ్ గానే ఉన్నారు. కాగా.. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయి గ్రూప్‌లో పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి దూరంగా ఉన్నాయి.రెండు జట్లు తమ రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 26న ఆడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోతే ఈ ఐసిసి టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవాలనే వారి కల దాదాపు చెదిరిపోతుంది. ఎందుకంటే వరుసగా రెండు పరాజయాలు ఇంగ్లాండ్‌ను అట్టడుగు స్థానంలో ఉంచుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కొక్క మ్యాచ్ గెలిచి వారి కంటే ముందంజలో ఉంటాయి. అయితే, దీని తరువాత అన్ని జట్లకు ఒక మ్యాచ్ మిగిలి ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ గెలిచినా, దానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సెమీస్ కు చేరాలంటే దానికి ఇంకా రెండు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఒక మ్యాచ్ రద్దు కావడం మూలాన ఒక మ్యాచ్ గెలిచిన కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటికే చెరో మూడు పాయింట్లను కలిగి ఉన్నాయి.
రికార్డులను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ జట్టు చాలా బలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య రికార్డును పరిశీలిస్తే ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, అఫ్గానిస్తాన్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ ఫార్మాట్‌లో రెండు జట్ల మధ్య చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు 16 నెలల తర్వాత రెండు జట్లు మళ్ళీ వన్డేలో తలపడనున్నాయి.
ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అలాగే జియో హాట్‌స్టార్‌లో కూడా ఉంటుంది.