యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్.. బుల్లితెరపై సందడి

తన అద్భుత ఆట తీరుతో టీమిండియాకు ఊపిరిగా నిలిచిన ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇప్పుడు బుల్లి తెరపై కనిపించబోతున్నాడు.

Update: 2020-02-18 16:28 GMT
yuvaraj File Photo

తన అద్భుత ఆట తీరుతో టీమిండియాకు ఊపిరిగా నిలిచిన ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ఇప్పుడు బుల్లి తెరపై కనిపించబోతున్నాడు.. అసోంకు చెందిన డ్రీమ్ హౌజ్ ప్రొడక్షన్స్ వెబ్ సీరీస్ లో యువరాజ్ సింగ్, ఆయన భార్య, తల్లి కూడా నటించబోతున్నారు. యువీ సోదరుడు జొరావర్ సింగ్ పాత్రనే యువరాజ్ సింగ్ చేస్తుండటంతో ఈ సీరీస్ పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. బాలీవుడ్ లో మరికొందరు నటులు కూడా ఈ సీరీస్ లో యాక్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా షబన్నమ్ సింగ్ మాట్లాడుతూ.. నా కోడలు, నా కుమారులు చూసి ఒక తల్లిగా గర్వపడుతున్న, ఇక వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర నా చిన్న కొడుకు జొరావర్ సింగ్ పోషిస్తున్నాడని తెలిపారు. ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. అక్షయ్ కుమార్ చిత్రం బచ్చన్ పాండే కథ రచయిత విపిన్ ఈ వెబ్ సిరీస్ భాగమవుతున్నారు. బాలీవుడ్ నటినటులు ఈ సిరీస్ లో నటిస్తున్నారు.

టీమిండియా తరపున 304 వన్డేలు ఆడిన యువరాజ్ 8,701 పరుగులు సాధించాడు. అందులో 14 శతకాలు, 50 అర్థశతకాలు ఉన్నాయి. అలాగే 40 టెస్టుల్లో 1900 పరుగులు చేశాడు. మూడు శతకాలు, 11 అర్థ శతకాలు ఉన్నాయి. 58 టీ20ల్లో 28 సగటుతో 1177 పరుగులు చేశాడు. ధోని సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్ లో ఈ ఘనత సాధింంచి ఒకే ఒక ఆటగాడిగా యువరాజ్ నిలిచాడు. క్యాన్సర్ కారణంగా కొంత కాలం క్రికెట్ కు దూరం అయ్యాడు. చికిత్స అనంతరం తిరిగి కోలుకొని జట్టులోకి చేరినప్పటికీ మునుపటి ఆట తీరును అందుకోవడంలో విఫలమైయ్యాడు. యువరాజ్ తన చివరి మ్యాచ్ 2017లో ఆడాడు. ఆతర్వాత క్రికెట్ నుంచి వీడ్కోలు పలిడాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. 

Tags:    

Similar News