IPL 2022: వేలంలో తగ్గేదేలే..!? సూర్యకుమార్ పై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్

* సూర్య కుమార్ యాదవ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ జట్లు

Update: 2021-10-05 12:15 GMT

సూర్యకుమార్ (ట్విట్టర్ ఫోటో)

IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 లో జరగబోయే ఆట కంటే ముందు మెగా ఆక్షన్ లో ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేయనుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక్కో జట్టులో కేవలం 4 ఆటగాళ్ళను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బిసిసిఐ కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ముంబై జట్టు తరపున ఆడుతున్న యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2022లో ముంబై జట్టుకు దూరం కానున్నాడు. ఇప్పటికే ముంబై జట్టు నుండి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, పోలార్డ్, బుమ్రా ఆటగాళ్ళను రిటైన్ చేసుకోనున్నారు.

దీంతో సూర్యకుమార్ యాదవ్ మెగా వేలంలో దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ధోని, రైనా వంటి సీనియర్ ఆటగాళ్ళ వయస్సు దృష్ట్యా తదుపరి ఐపీఎల్ లో ఆడుతారా లేదా అనేది అనుమానమే. రానున్న టౌర్నమెంట్ లో టీంలో వారు లేని లోటు తీర్చాలన్నా, చెన్నై బ్యాటింగ్ లైనప్ బలపడటానికి అయిన సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాడు అయితే సరిగ్గా సరిపోతాడని చెన్నై జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

మరోపక్క హైదరాబాద్ జట్టు కూడా సూర్యకుమార్ ని వేలంలో సొంతం చేసుకుని పేలవంగా ఉన్న తమ బ్యాటింగ్ లైనప్ ని పటిష్టం చేసుకోవాలని ఎదురుచూస్తుంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి దూరమైన డేవిడ్ వార్నర్ ని రాయల్ ఛాలెంజర్స్ జట్టు కొనుగోలు చేసి అటు ఓపెనర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా జట్టుకు ఉపయోగపడుతాడని.., అందుకోసం వార్నర్ కోసం భారీ మొత్తం చెల్లించడానికి కూడా బెంగుళూరు జట్టు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News