Champions Trophy 2025: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ఎవరు ఛాంపియన్ అవుతారు?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మార్చి 9న దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
Champions Trophy 2025: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ఎవరు ఛాంపియన్ అవుతారు?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మార్చి 9న దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్ అవుతుంది. అంతకుముందు, ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ దశలో చివరి మ్యాచ్ జరిగింది. అందులో భారత్ గెలిచింది. ప్రస్తుతం ఫైనల్ కావడంతో సాధారణంగానే రెండు జట్ల పై ఒత్తిడి ఉంటుంది. మరి ఏదైనా కారణం చేత మ్యాచ్ రద్దు అయితే ఏ జట్టు ఛాంపియన్ అవుతుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ నాకౌట్ మ్యాచ్‌లలో ఐసిసి అన్ని విధాలుగా ఫలితాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. దీని కోసం గ్రూప్ దశతో పోలిస్తే కొన్ని భిన్నమైన నియమాలు ఉంటాయి. ఈసారి ఐసిసి రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను ఉంచింది. ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే ఉంది. అంటే ఈ మ్యాచ్ మార్చి 9న జరుగకపోతే.. ఆ మ్యాచ్ మార్చి 10న కూడా జరుగుతుంది. కానీ ఆటను షెడ్యూల్ చేసిన తేదీకి ముగించడానికి అన్ని ప్రయత్నాలను ఐసీసీ చేస్తుంది. ఇది సాధ్యం కాకపోతే రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఆగిపోయిన చోట నుండి ప్రారంభిస్తుంది..
మరోవైపు, సెమీ-ఫైనల్స్‌లో నియమం ఏమిటంటే, మ్యాచ్ రద్దు అయితే గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఇది ఫైనల్‌లో కనిపించదు. వర్షం లేదా మరేదైనా కారణం వల్ల ఫైనల్ రద్దు అయితే ట్రోఫీని పంచుకుంటారు. అంటే రెండు జట్లను ఉమ్మడి ఛాంపియన్లుగా పరిగణిస్తారు. ఫలితాన్ని నిర్ణయించడానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.. కానీ దీనికి కూడా కనీసం 25 ఓవర్ల మ్యాచ్ అవసరం.
ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్ భారత్, ఆతిథ్య శ్రీలంక మధ్య జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేకపోయారు.. దీంతో ట్రోఫీని రెండు జట్లు పంచుకున్నాయి.