Champions Trophy 2025: భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్

Champions Trophy 2025: ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో ఉంది. సెమీ ఫైనల్స్ ఆడకముందే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.

Update: 2025-03-03 07:31 GMT

Champions Trophy 2025: భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్

Champions Trophy 2025

ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో ఉంది. సెమీ ఫైనల్స్ ఆడకముందే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. మాథ్యూ షార్ట్ గాయం కారణంగా తదుపరి మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్న మాథ్యూ షార్ట్ స్థానంలో యువ కూపర్ కొన్నోలీని నియమించింది. బ్యాట్స్‌మన్‌గా ఉండటమే కాకుండా...షార్ట్ లాగా బంతిని తిప్పడంలో కూడా నిష్ణాతుడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. దాని కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. షార్ట్ సరిగ్గా కదలలేకపోతున్నాడని కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రైమ్ వీడియోతో అన్నారు. మ్యాచ్‌ల మధ్య విరామంలో అతను కోలుకుంటాడని అనుకున్నారు..కానీ అది జరుగలేదు.

ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయంలో మాథ్యూ షార్ట్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో తను 66 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అంతేకాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ విధంగా అతను టోర్నమెంట్‌లోని 2 మ్యాచ్‌ల్లో 83 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా జట్టులోకి 21 ఏళ్ల కూపర్ కొన్నోలీ ప్రవేశాన్ని ICC టెక్నికల్ కమిటీ ఆమోదించింది. కూపర్ జట్టు ట్రావెలింగ్ రిజర్వ్‌లో భాగం. కూపర్ కొన్నోలీ గత సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడాడు. వాటిలో 10 పరుగులు చేయడం తప్ప పెద్దగా రాణించింది లేదు.

కూపర్ కొన్నోలీ సోమవారం అంటే సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు.అతను సెమీ-ఫైనల్స్ లో ఓపెనర్ గా ఆడతాడని కూడా ఊహాగానాలు ఉన్నాయి. జట్టులో ఇప్పటికే జాక్ ఫ్రేజర్ లాంటి ఓపెనర్ ఉన్నప్పటికీ, కూపర్ ఆడటానికి ప్రధాన కారణం అతని ఎడమ చేయి స్పిన్ బౌలింగ్.. ఇది షార్ట్ లాగా జట్టుకు బౌలింగ్ అందిస్తాడు.

Tags:    

Similar News