Champions Trophy 2025: బెట్టింగ్ కేసులో ఆల్ రౌండర్ పై 3నెలలు నిషేధం.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్
Champions Trophy 2025: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బ్రైడాన్ కార్స్ ను ప్రస్తుతం టోర్నమెంట్ నుంచి తొలగించారు. అందుకు కారణం తన పై నమోదైన బెట్టింగు కేసు.
Champions Trophy 2025: బెట్టింగ్ కేసులో ఆల్ రౌండర్ పై 3నెలలు నిషేధం.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు పూర్తయ్యాయి. భారత్ సెమీ పైనల్ బెర్త్ కన్ఫాం చేసుకుంది. భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఇదే సమయంలో ఓ జట్టుకు షాక్ తగిలింది. టోర్నమెంట్ నుంచి స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బ్రైడాన్ కార్స్ ను ప్రస్తుతం టోర్నమెంట్ నుంచి తొలగించారు. అందుకు కారణం తన పై నమోదైన బెట్టింగు కేసు. దీని కారణంగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మాత్రమే కాకుండా క్రికెట్ నుంచి తనను 3నెలల పాటు నిషేధించారు. అంతే కాకుండా బ్రేడెన్ కార్స్ కాలి వేలికి గాయమైంది. బ్రైడాన్ లేకపోవడంతో తన స్థానంలో 20 ఏళ్ల రెహాన్ అహ్మద్ ఇంగ్లాండ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్, దుబాయ్‌లోని పిచ్‌లను పరిశీలిస్తే అహ్మద్ బ్రైడాన్‌కు ఇతడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.
బ్రైడాన్ కార్స్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, ఫాస్ట్ బౌలర్. అతను 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తన జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఫిబ్రవరి 22న లాహోర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను 8 పరుగులు చేయడమే కాకుండా, 69 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, బ్రైడాన్ భారత్‌తో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టులో కూడా ఆటగాడిగా ఉన్నాడు.
అయితే, ఇప్పుడు బ్రైడాన్ కార్స్ గాయం కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఐసిసి టెక్నికల్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అతని స్థానంలో రెహాన్ అహ్మద్‌ను నియమించాలని ఇంగ్లాండ్ నిర్ణయించింది. రెహాన్ అహ్మద్ ఒక లెగ్ స్పిన్నర్. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున ఆడిన 21 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున 6 వన్డేలు ఆడి 10 వికెట్లు తీశాడు. ఈ వారం చివరి నాటికి రెహాన్ అహ్మద్ పాకిస్తాన్ చేరుకునే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన బ్రైడాన్ కార్స్ పై బెట్టింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఆరోపణ కారణంగా తనపై 3 నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం గత ఏడాది మే 28 నుండి ఆగస్టు 28 వరకు విధించారు. బ్రైడాన్ కార్స్ 2017, 2019 మధ్య 303 బెట్టింగులు వేసినట్లు సమాచారం.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, ఇంగ్లాండ్ ఇప్పుడు ఫిబ్రవరి 26న లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అది మార్చి 1న దక్షిణాఫ్రికాతో తలపడాలి. సెమీఫైనల్‌కు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇంగ్లాండ్ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి.