Sania Mirza: నేనేదీ దాచుకోను... అందుకే నాసినిమాపై భయం లేదు

సానియా మీర్జా జీవిత కథను వెండితెరపై సినిమా తీయాలని నిర్ణయించారు.

Update: 2020-02-15 02:23 GMT
సానియా మీర్జా

సానియా మీర్జా జీవిత కథను వెండితెరపై సినిమా తీయాలని నిర్ణయించారు. అయితే తన చరిత్రను చూపించడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అంటోంది. తన జీవిత కథను అభిమానుల ముందు తీసుకురావడం ఎలాంటి భయన్ని కలిగించట్లేదని ఆమె అంటోంది. కాగా.. సానియా మీర్జా దీనిపై మాట్లాడుతూ.. ' నా కథ సినిమా తీసే విషయమై దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. నాది ఎలాంటి వ్యక్తిత్వమో , నా కెరీర్‌ను మొదటి నుంచి చూసిన ఎవరికైనా తెలుస్తుంది. నేను మనసు ఒకటి బయటకు మరోటి మాట్లాడను..అలా ఏదీ దాచుకోను. నాకు ఏమనినిపిస్తే అది చేస్తా. ఏ విషమైనా బయటికి చెప్తాను. కాబట్టి నా కథను అభిమానుల ముందుకు తెస్తున్నందుకు భయపడట్లేదు. కాబట్టి నా జీవిత చరిత్రను సినిమాగా రాబోతుండటం ఉత్సాహం కలిగిస్తోంది అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ విజేతలను ప్రేమిస్తారు. కానీ ఎన్నో అడ్డంకులను అధిగమి ఆ స్థానానికి చేరుకువాల్సి ఉంటుంది. నా లానే ఎంతోమంది క్రీడాకారులు.. స్టార్స్ గా ఎదిగారు. దేశానికి ప్రాతినిథ్యం వహించారు'' అని తెలిపారు.

టెన్నిస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత సానియా గ్రాండ్‌స్లామ్‌ (డబుల్స్‌) గెలవడంతో పాటు మరే ఇండియా టెన్నిస్‌ క్రీడాకారిణికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే సానియా మీర్జా జీవిత చరిత్ర సినిమాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలియాభట్, రాధికాఆప్టే, ప్రీతీచోప్రా, దిశా అయితే వీరిలో సానియా మీర్జా పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది స్పష్టత రాలేదు.

  

Tags:    

Similar News