ధోనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ తర్వాత నుంచి తిరిగి భారత జట్టులోకి అడుగు పెట్టలేదు.

Update: 2019-11-30 06:35 GMT
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్ ధోని

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ తర్వాత నుంచి తిరిగి భారత జట్టులోకి అడుగు పెట్టలేదు. దీంతో ధోని టీమిండియా తరపున తిరిగి ఆడతారా? లేక రిటైర్డ్ మెంట్ ప్రకటిస్తారా? అనే సందేహాలు మొదలైయ్యాయి. అయితే తాజాగా ధోని పునరాగమనంపై చర్చలు నడుస్తున్న సమయంలో దీనిపై స్పందించారు టీమిండియా మాజీ సారథి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. ధోని క్రికెట్ భవిష్యత్తుపై తమకు స్పష్టత ఉందని తెలిపారు.

అన్ని విషయాలు బహిరంగ పరచలేమని వెల్లడించారు. ధోని క్రికెట్‌పై సెలక్టర్లకు ఒక అంచనా ఉందన్నారు. టీమిండియా క్రికెట్‌కు ధోని ఒక అసాధారణ అథ్లెట్‌గా అని గంగూలీ అభివర్ణించారు. అయితే ధోని తన క్రికెట్ పునరాగమనం గురించి మాట్లాడుతూ.. వచ్చే జనవరి నుంచి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అప్పటి వరకూ తనను ఏలాంటి ప్రశ్నలు అడగవద్దని కోరారు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాతే ధోని రిటైర్మెంట్‌ అవుతారని అంతా ఊహించారు.

ఐపీఎల్ తర్వాత ధోని నిర్ణయం ఉంటుందని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. టీమిండియాకు ధోని తన సారథ్యంలో రెండు వరల్డ్ కప్‌లు అందించారు. 2014లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై 2019లో టీ20 ఆడారు. అలాగే న్యూజిలాండ్ పై ఈ ఏడాది చివరి వన్డే మ్యాచ్ ఆడారు. ఇప్పటి వరకూ 350 వన్డే మ్యాచ్ లు ఆడిన ధోని 10,773 పరుగులు సాధించారు. 98టీ20 మ్యాచ్ ల్లో1,617 పరుగులు సాధించారు.



Tags:    

Similar News