Ind Vs WI 2022: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్ కెప్టెన్‌గా..
Ind Vs WI 2022: టీమిండియా వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Ind Vs WI 2022: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్ కెప్టెన్‌గా..
Ind Vs WI 2022: టీమిండియా వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్ తో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇండియా తరఫున జట్టుకు శిఖర్ ధావన్ కెప్టన్‌గా సారథ్యం వహించనున్నారు. రవీంద్ర జడేజా వైస్‌కెప్టన్‌గా బరిలో దిగనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్‌హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, సంజూశాంసన్, శార్థూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ క్రిష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లతో వన్డే జట్టును బీసీసీఐ ఖరారు చేసింది.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా!
వన్డే సిరీస్
►జూలై 22- మొదటి వన్డే
►జూలై 24- రెండో వన్డే
►జూలై 27- మూడో వన్డే
టీ20 సిరీస్
►మొదటి టీ20- జూలై 29
►రెండో టీ20- ఆగష్టు 1
►మూడో టీ20- ఆగష్టు 2
►నాలుగో టీ20- ఆగష్టు 6
►ఐదో టీ20- ఆగష్టు 7