రాకాసి బంతి.. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమే

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి బుధవారానికి 5ఏళ్లు. ఫిల్ హ్యూస్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ దేశవాలి టోర్నిలో ఆడుతుండగానే లో గాయపడి మృతి చెందాడు.

Update: 2019-11-27 07:44 GMT
Phillip Hughes File photo

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి బుధవారానికి 5ఏళ్లు. ఫిల్ హ్యూస్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ దేశవాలి టోర్నిలో ఆడుతుండగానే లో గాయపడి మృతి చెందాడు. సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అబాట్ వేసిన ఓ బౌన్సర్ ఫిల్ హ్యూస్ తలకు బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయమై, సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. హ్యూస్ వికెట్ తీయాలనే లక్ష్యంతో బౌలర్ సీన్ అబౌట్ బౌన్సర్ విసిరాడు. బంతిని ఎదుర్కొనే సమయంలో అతను వెనక్కి తిరగాడు తల వెనుక భాగాన్ని తాకడంతో కుప్పకూలిపోయాడు. రెండు రోజుల చికిత్స అనంతరం 2014 నవంబరు 27 న మృతి చెందారు. హ్యూస్ చనిపోయే సమయానికి అతని వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే.

ఫిల్ హ్యూస్‌కు మరణం తర్వాత ఐసీసీ చాల మార్పులు చేసింది. బ్యాట్స్ మెన్స్ ఆడేముందు నెక్ గార్డు తప్పనిసరి చేసింది. హ్యూస్ మరణించిన ఐదు సంవత్సరాలు కావడంతో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆసీస్‌కు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చాలా భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ సందర్భంగా ఐదేళ్లుగా హ్యూస్‌ను మరచిపోయిన రోజు లేదని, అతను తమ మధ్య ఇంకా జీవించి ఉంన్నాడనే భావిస్తున్నానని క్లార్క్ ట్విట్ చేశారు. హ్యూస్‌తో కలిసి ఆడిన ఫొటోను స్టీవ్ స్మిత్ షేర్ చేశారు. మిస్ యూ బ్రో అంటూ ట్విట్ చేశారు.

క్రికెటర్ గా రాణిస్తున్న సమయంలో హ్యూస్ మరణించడంపై యావత్ క్రీడా ప్రపంచం నివ్వేరపోయింది. 2014 అక్టోబరు పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ హ్యూస్ చివరి మ్యాచ్. అంతర్జాతీయ కెరీర్‌లో హ్యూస్ 26 టెస్టులు, 25 వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో మూడు సెంచరీలు ఏడు అర్ధ సెంచరీలు, వన్డేల్లో రెండు సెంచరీలు సాధించారు.



Tags:    

Similar News