అలసిపోయా.. ఆ ఫార్మాట్ నుంచి తప్పుకుంటా: డేవిడ్‌ వార్నర్‌

ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై, వచ్చే సంవత్సరం భారత్ గడ్డపై టీ20 ప్రపంచ కప్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Update: 2020-02-12 10:47 GMT
డేవిడ్‌ వార్నర్‌

ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై, వచ్చే సంవత్సరం భారత్ గడ్డపై టీ20 ప్రపంచ కప్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని వార్నర్ వెల్లడించారు. 2020, 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. "అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం చాలా కష్టంగా ఉంది. రెండు ఏళ్లపాటు వరుసగా టీ20 ప్రపంచ కప్ లు ఉన్నాయి. మరికొన్నేళ్లలో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవచ్చు , అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడడం ఏబీ డివిలియర్స్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి ఆటగాళ్లను ఆడగాలి వారికి తెలుసు అన్ని ఫార్మాట్లో క్రికెట్ ఆడడం ఎంతో కష్టమని అని వార్నర్ తెలిపారు.

అయితే ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడకపోవడానికిగల కారణాలను వార్నర్ తెలిపారు. బిగ్‌బాష్‌ లీగ్‌ జరిగే సమయంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసున్నానని, దాని ద్వారా మానసికంగా , శారీరకంగా తదుపరి సిరీస్‌లకు సన్నద్ధం కావాలనే ఉద్ధేశ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. భార్య, ముగ్గురు పిల్లలను చూసుకోకుండా తరచూ ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వలోనే ఒక ఫార్మాట్ కు వీడ్కోలు పలికితే కాస్త ఉపసమనం కలుగుతుందని వెల్లడించారు. అయితే ఆ ఫార్మా్ట్ టీ20లు కావొచ్చని పరోక్షంగా తెలిపారు. వార్నర్ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)'అలెన్‌ బోర్డర్‌' పతకాన్ని అందుకున్నాడు.

ఆస్ట్రేలియా తరఫున 76 టీ20లు ఆడిన వార్నర్ 2,079 పరుగులు చేశాడు. దీనిలో ఒక శతకంతోపాటు 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 119 వన్డేల్లో 5,136 పరుగులు చేశాడు. దీనిలో 18 శతకాలు, 20 అర్థశతకాలు ఉన్నాయి. ఇక 84 టెస్టు మ్యా్చ్ ల్లో 7,244 పరుగులు చేసి 24 శతకాలు , 30 అర్థ శతకాలు చేశాడు. టెస్టుల్లో 334 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో లారా రికార్డు తర్వాత స్థానంలో వార్నర్ ఉన్నాడు.

 

Tags:    

Similar News