Australia vs India 3rd Test: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ

Update: 2021-01-11 02:14 GMT

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య సీడ్నీవేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఐదో రోజు ఆటలో టీమిండియా భోజన విరామ సమయానికి 76 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లు ధాటిగా ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో పంత్ (73,97బంతుల్లో,8X4,3x6) ఆర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్ లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్ లో పుజారా(41,147 బంతుల్లో, 5ఫోర్లు) పూర్తి డిఫెన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి 104 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే 201 పరుగులు అవసరం. భారత్ బ్యాటింగ్ సరళి చూస్తే డ్రా వైపై మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. 



Similar News