Asia Cup 2025: మెగా టోర్నీకి రంగం సిద్ధం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్..!
Asia Cup 2025 Kicks Off in Abu Dhabi: ఆసియా కప్ 2025 ఈరోజు అబుదాబీ వేదికగా ప్రారంభం కానుంది.
Asia Cup 2025: మెగా టోర్నీకి రంగం సిద్ధం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్..!
Asia Cup 2025 Kicks Off in Abu Dhabi: ఆసియా కప్ 2025 ఈరోజు అబుదాబీ వేదికగా ప్రారంభం కానుంది. అప్ఘనిస్తాన్ - హాంకాంగ్ తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభించానున్నారు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్‌లు అన్నీ జరగనున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహకంగా ఆసియా ఖండంలోని జట్లు తమ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచున్నారు.
టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. భారత్ - పాక్ మధ్య సెప్టెంబర్ 14న హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్ ఇలా టోర్నీని డిజైన్ చేశారు. ఆసియా కప్ 2025 విజేతగా నిలిచే జట్టుకు 2.6 కోట్లు ఇవ్వనున్నారు. 2022లో శ్రీలంక వేదికగా చివరిసారిగా జరిగిన టోర్నీలో 1.6 కోట్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. గత ఎడిషన్‌తో పోల్చితే ఈసారి 50 శాతం అధికంగా ప్రకటించారు. రన్నరప్‌గా నిలిచే జట్టుకు 1.3 కోట్లు.. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు 80, 60 లక్షలు ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ 2026ను దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీ పాల్గొనే అన్ని దేశాలు తమ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఈ టోర్నీలో బాగా ఆడే వారినే రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ప్రతి ప్లేయర్ కూడా శక్తికి మించి పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తున్నారు. అయితే, ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టే ఫేవరెట్‌గా ఉండబోతోంది. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్స్ జరగనుంది.