Tokyo Olympics లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ క్యాష్ రివార్డ్
Tokyo Olympics: జపాన్ లోని టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం సత్కరించింది.
Tokyo Olympicsలో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ క్యాష్ రివార్డ్
Tokyo Olympics: జపాన్ లోని టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం సత్కరించింది. జులై 23 నుంచి ఆగస్టు8 వరకూ జరుగుతున్న ఈ పోటీల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపియన్స్ పీ.వి. సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్,రజనీష్ లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ ను అందించడమే కాక ఒలింపిక్స్ లో తమ ప్రతిభను కనపరచాలని పిలుపునిచ్చారు.
పీవీ సింధుకు విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాలభూమికి సంబంధించిన జీవోను అందచేశారు. భారత హాకీ మహిళా విభాగం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె తరపున ఆమె తల్లి దండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడామంత్రి అవంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.