ఉరి శిక్షే సరైనది..

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో డాక్టర్‌ ప్రియాంకపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Update: 2019-12-01 10:12 GMT
అంబటి రాయుడు

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో డాక్టర్‌ ప్రియాంకపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ ప్రజలంతా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో గొంతెత్తారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖు స్పందిస్తున్నారు.

టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, మనుషులు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని ట్విట్ చేశారు. అత్యాచార నిందితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారికి వెంటనే ఉరి తీయాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహిళల శీలాన్ని దోచుకోవాలని ఆలోచించే వారికి కనువిప్పు కలిగించేలా శిక్షవేయాలన్నారు. అత్యాచారాలు చేసే వారికి ఉరి శిక్షే సరైందని ట్విట్ లో పేర్కొన్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.


  

Tags:    

Similar News