Kabaddi: హైదరాబాద్ లో 49వ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలు
Kabaddi: ఏర్పాట్లను పరిశీలించిన నిర్వాహకులు కాసాని వీరేశ్
Kabaddi: హైదరాబాద్ లో 49వ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలు
Kabaddi: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో 49వ నేషనల్ జూనియర్ కబడ్డీ చాంపియన్ టోర్నీ నిర్వహించనున్నారు. కాసాని కౌసల్య ముదిరాజ్ జ్ఞాపకార్థం ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా కాసేపట్లో ఈ కబడ్డీ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 4 వరకు కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కబడ్డీ ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటారని నిర్వాహకులు కాసాని వీరేష్ తెలిపారు. ఈ టోర్నీలో గెలిచిన టీమ్ ఏషియన్ గేమ్స్‌లో ఆడేందుకు అవకాశం ఉందన్నారు కాసాని వీరేష్. నాలుగు రోజుల పాటు జరగనున్న టోర్నీ పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు కాసాని వీరేష్.