Morning Mistakes: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

Morning Mistakes: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

Update: 2022-02-17 00:30 GMT

Morning Mistakes: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

Morning Mistakes: ఉదయమే లేచి ఎవరి ముఖం చూసానో ఈ రోజు అంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేయడం మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ఇక వారికి ఆ రోజు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా సానుకూల ఫలితం ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు మన తప్పులు ఇలాంటి పరిస్థితులకు కారణం కావచ్చు. ఈ పొరపాట్లు ప్రతిరోజూ చేస్తే ఒక వ్యక్తి అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది.

ఉదయం సమయం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయాన్ని సానుకూలంగా ప్రారంభిస్తే ఆ రోజంతా సూపర్‌గా ఉంటుంది. అయితే దురదృష్టానికి సూచిక అయిన కొన్ని తప్పులు చేస్తే ఆ రోజంతా చెడుగా గడిచిపోతుంది. ఇది మనస్సుకు శాంతిని ఇవ్వదు. పనిలో విజయాన్ని ఇవ్వదు. మొత్తంమీద మంచి ఏమీ జరగదు. ఈ రోజు మనకు అలాంటి తప్పుల గురించి తెలుసుకుందాం.

అద్దంలో చూడండి: వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మరోవైపు, వివాహిత జంట పడకగదిలో అద్దం ఉండటం వారి సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

నీడ: మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ లేదా ఇతరుల నీడను చూడకండి. ఇది ఉద్రిక్తత, వివాదాలను ప్రోత్సహిస్తుంది. ఇది జీవిత ప్రశాంతతను దూరం చేస్తుంది.

మురికి పాత్రలు: వాస్తు శాస్త్రంలో వంటగదిని శుభ్రం చేసి రాత్రి నిద్రపోవాలని చెబుతారు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మురికి పాత్రలను చూడటం మంచిదికాదు. వాస్తు ప్రకారం.. ఆహారం తిన్న పాత్రలు, గిన్నెలు అలాగే ఉండటం వల్ల తల్లి లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది.

Tags:    

Similar News