Horoscope Today(21/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి..

Horoscope Today(21/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి..

Update: 2023-04-20 23:30 GMT

Horoscope Today(21/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి..

Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే. మీరు క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఆ రోజు మీ నక్షత్రాలు, రాశులు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండనున్నాయి. శ్రీ మృదుల అందించే నేటి రాశి ఫలాల వివరాలు..

21/04/2023 శుక్రవారం

సూర్యోదయం 05.58 సూర్యాస్తమయం 6.31

స్వస్తిశ్రీ శోభకృత్ నామసంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం , శుక్రవారం

తిధి : శుక్ల పాడ్యమి ఉదయం 8.30 వరకు తరువాత శుక్ల విదియ

నక్షత్రము : భరణి ఈ రోజు ఉదయం 11.09 వరకు తదుపరి కృత్తిక నక్షత్రం

చంద్రరాశి : మేషరాశి 19/4/2023 నుంచి 22/04/2023

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తం : ఉదయం 08.29 నుంచి 09.19 వరకు మరియు మధ్యాహ్నం 12.40 నుంచి 1.30 గంటల వరకు

రాహుకాలం : ఉదయం 10.40 నుంచి 12.14 వరకు

అమృత ఘడియలు : సా. 6.14 నుంచి 7.50 వరకు

మేషరాశి : ఆకస్మిక రాజసన్మానాలు, శుభసూచనలుఎంతో కొంత వరకు వ్యక్తిగత జీవనము పనిచేసే చోట ఇబ్బందులు, తోటివారు తక్కువగా చూడటం లాంటి సూచనలు ఉన్నాయి

వృషభరాశి : తలపెట్టిన పనులు సకాలంలో నిర్వహించగలుగుతారు. తోటి ఉద్యోగులతో గొడవలు లేకుండా చూసుకొని కుటుంబాన్ని సరిగ్గా నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మిధునరాశి: ఆధ్యాత్మిక జీవనంలో ముందంజ వేస్తారు. మీ ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. సమస్త శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ధార్మికతత్వం పైన అభిలాష, ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకరాశి : అడుగడుగునా ప్రతిబంధకములు, అలజడులు కల్గుతాయి. కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్లు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహరాశి : గృహవాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి , ఉద్యోగాలలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది మంచి సమయం. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలం.

కన్యారాశి : సంతానం పట్ల శ్రధ్ద వహించడం, ఉన్నతవిద్య, ఉపాది సమాజంలో గౌరవస్థానం సంపాదించి పెట్టడం, గృహ నిర్మాణాలకు కలిసి రావడం లాంటి శుభ సూచనలు ఉన్నాయి.

తులారాశి : భిన్న ఆచారాలు సంప్రదాయాలనుంచి జీవిత భాగస్వామి వచ్చే సూచనలు ఉన్నాయి. స్వయం వృత్తుల వారికి న్యాయవాద, సినీ కళాకారులకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి.

వృశ్చికరాశి: ఆర్థికంగా హెచ్చుతగ్గులకు, ప్రమాదాలకు దారి తీయొచ్చు. గృహ వాతావరణం అనుకూలంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

ధనురాశి : మీ కృషికి మరిన్ని విజయాలు సిద్ధిస్తాయి. స్వకార్య సిద్ధి , చిత్త శుద్ధితో చేసిన పనిలో విజయం సాధిస్తారు, రాజకీయంగా ముందంజ, అన్నింటా విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

మకరరాశి : మానసిక స్థైర్యంతో ఉండుట అవసరం. దుబారాగా ఖర్చులు చేయడం, అనైతిక కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా ఉంటే మంచిది, ఆందోళనలు కల్గించే సమయం జాగ్రత్తగా ఉండటం అవసరం.

కుంభరాశి : పనులు ఆలస్యం, చేసిన పనులే మరళా మరళా చేయాల్సి రావడం. మానసిక, శారీరక వ్యథ, కాలయాపన ఉన్నా చివరికి పనులు పూర్తవుతాయి. వృత్తి జీవితాన్ని ఆస్వాదించడం, కష్టపడి పనిచేయడం వలన ఉన్నత అవకాశాలు వస్తాయి.

మీనరాశి : అన్ని వృత్తుల వారికి ప్రతిభను బట్టి లాభదాయకమైన సంపాదనా శక్తి పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. సంపదలో ఉన్నత స్థాయిని అందుకుంటారు.


Sree Mrudula

Astrologer and Spiritual Healer

970481027

Tags:    

Similar News