జూమ్ యాప్ పై.. సీఈఓ వివరణ

లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేశాయి.

Update: 2020-05-07 02:38 GMT
Zoom App CEO Eric Yuan

లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేశాయి.దాంతో స్కైప్, జూమ్ (Zoom) యాప్‌ లలో వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీని వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో జూమ్ యాప్ ఎంత మాత్రం భద్రం కాదని భారత ప్రభుత్వం హెచ్చరించింది. దాంతో ఈ యాప్ ను ఉపయోగించించడం తగ్గించేశారు.. ఈ యాప్ చైనాకు చెందినదని.. ఇది వాడటం వలన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లకు జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ వివరణ ఇచ్చారు.. తన కంపెనీ అమెరికన్ అని చైనీస్ కాదని ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

జూమ్ యాప్ నకు చైనాతో లింక్ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు బ్లాగుపోస్టులో యువాన్ పేర్కొన్నారు. జూమ్ ఒక అమెరికన్ సంస్థ, కాలిఫోర్నియాలో స్థాపించబడింది , దీని ప్రధాన కార్యాలయం, డెలావేర్లో విలీనం చేయబడింది.. అంతేకాదు దీనిని బహిరంగంగా నాస్డాక్ బిజినెస్ లో ఉందని చెప్పారు. జూమ్‌కు చైనాలోని ఇతర బహుళజాతి సాంకేతిక సంస్థల మాదిరిగా కార్యకలాపాలు, ఉద్యోగులు ఉన్నారని యువాన్ చెప్పారు.


Tags:    

Similar News