ప్రపంచంలోని అందమైన ప్రదేశాల రహస్యాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Beautiful Places: ఈ ప్రపంచంలో మనుషులకు తెలియని ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి.

Update: 2021-11-29 16:32 GMT

ప్రపంచంలోని అందమైన ప్రదేశాల రహస్యాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు (ఫైల్ ఇమేజ్)

Beautiful Places: ఈ ప్రపంచంలో మనుషులకు తెలియని ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఇవి అందమైనవే కాకుండా మర్మమైనవి కూడా. ఈ ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. అంతేకాదు అక్కడ కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. అలాంటి నాలుగు అందమైన, రహస్య ప్రదేశాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. కొలంబియా కేథడ్రల్

కొలంబియాలోని ఇపియల్స్ నగరంలో లాస్ లాజాస్ అనే పేరుతో ఒక కేథడ్రల్ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ కేథడ్రల్ ఈక్వెడార్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. దీని కింద నది ప్రవహిస్తుంది. ఈ కేథడ్రల్ చూస్తుంటే అడవుల మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న దృశ్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

2. కైలాస పర్వతం

దాదాపు 6600 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం గురించి ఇప్పటికే మీరు విని ఉంటారు. భారతదేశంలో ఇది శివుని నివాసంగా చెబుతారు. కొంతమంది కైలాస పర్వతాన్ని భూమికి కేంద్ర బిందువుగా భావిస్తారు. ఇప్పటి వరకు వేలాది మంది ఈ పవిత్ర పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అధి సాధించలేకపోయారు. ఇది ఒక రహస్యం.

3. పాకిస్తాన్ మిస్టీరియస్ వ్యాలీ

పాకిస్తాన్ వాయువ్య, హిందూకుష్ పర్వత శ్రేణుల మధ్య కలాష్ అనే లోయ ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న తెగకు కలాష్ అని పేరు. ఈ ప్రజలు అలెగ్జాండర్ వంశస్థులని చెబుతారు. వారి సంప్రదాయాలు పురాతన హిందూ సంప్రదాయాల మాదిరిగానే ఉంటాయి. అయితే వారు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారనేది ఎవ్వరికి తెలియదు. కానీ వారి గురించి చాలా రహస్య విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

4. ఇసుక సముద్రం

నీటి సముద్రం గురించి మీరు వినే ఉంటారు కొంతమంది చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఇసుక సముద్రాన్ని చూశారా? ఇది సౌదీ అరేబియా నుంచి యెమెన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి ఉంది. దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక సముద్రం అంటారు. ఇది అందమైన భయంకర ప్రదేశం అని చెప్పవచ్చు.

Tags:    

Similar News