Viral News: సినిమాల ప్రభావం.. ప్రియుడితో వెళ్లేందుకు వివాహిత ఏం చేసిందో తెలుసా? అచ్చం దృశ్యం సినిమాలాగే
Viral News: గుజరాత్‌లోని పాటన్ జిల్లా సంతాల్‌పూర్ తాలూకాలోని జఖోట్రా గ్రామంలో సినిమాను తలదన్నె సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివాహిత గీతా అహిర్ (22) తన ప్రియుడు భరత్ (21)తో కలిసి జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో భర్తను మోసం చేస్తూ ఓ దారుణ నాటకాన్ని ఆడింది. అయితే చివరికి ఆ వ్యూహం విఫలమై ఇద్దరూ పోలీసులకు చిక్కారు.

భర్తకు తెలియకుండా భరత్‌తో సంబంధం కొనసాగించిన గీతా, ఎవరికీ అనుమానం రాకుండా రాజస్థాన్‌కు పారిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన మరణాన్ని నమ్మేలా చేసి ఇంటి వారిని మోసగించేందుకు ఓ కన్నింగ్ ప్లానింగ్ వేసింది.
ఈ క్రమంలో వీరిద్దరూ రాత్రివేళ ఒంటరిగా ఉన్న హర్జీభాయ్ సోలంకీ (56) అనే ఓ వ్యక్తిని టార్గెట్ చేశారు. భరత్ అతడిని హత్య చేసి, శవాన్ని గ్రామ శివారులోని కుంట పక్కన పడేశాడు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటపడ్డ గీత, ఆ శవానికి తన దుస్తులను, గజ్జెలను వేసి శవాన్ని పెట్రోలుతో కాల్చింది. అనంతరం ఇద్దరూ జోధ్‌పుర్ వైపు పరారయ్యారు.
గీత కనిపించకపోవడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, శవాన్ని గుర్తించి మొదటగా అది గీతదేనని భావించారు. కానీ పోలీసుల విచారణలో అది పురుషుడి శవమని తేలింది. తద్వారా అసలైన నిజం వెలుగులోకి వచ్చింది.
రైలులో జోధ్‌పుర్ వెళ్తున్న సమయంలో పాలన్‌పుర్ వద్ద భరత్, గీతను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గీత మాట్లాడుతూ ఈ చర్యకు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాల నుంచే ఆలోచన వచ్చిందని ఒప్పుకుంది. ఇప్పుడీ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.