IAS Officer: ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. ఎలాంటి అలవెన్స్‌లు లభిస్తాయి..!

IAS Officer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి.

Update: 2022-09-30 09:10 GMT

IAS Officer: ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. ఎలాంటి అలవెన్స్‌లు లభిస్తాయి..!

IAS Officer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు హాజరవుతారు. ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అయితే వారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు అవుతారు. మన సమాజంలో ఐఏఎస్ అధికారికి ఎంతో గౌరవం ఉంటుంది. ఒక ఐఏఎస్ అధికారి జీతం ఎంత, వారికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం.

IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీరు దేశంలోని బ్యూరోక్రాటిక్ నిర్మాణంలో పని చేసే అవకాశం పొందుతారు. IAS అధికారులను ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, పరిపాలనా విభాగాలలో నియమిస్తారు. ఐఏఎస్‌కి తన మొత్తం సర్వీస్‌లో అత్యున్నత పదవి 'కేబినెట్ సెక్రటరీ'. ప్రతి ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ పదవికి చేరుకోవాలని కోరుకుంటాడు.

ఒక IAS అధికారి జీతం గురించి మాట్లాడితే అతను 7వ పే కమిషన్ కింద బేసిక్‌ వేతనంగా రూ.56,100 పొందుతాడు. ఇది కాకుండా IAS అధికారులకు ట్రావెలింగ్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్‌తో సహా అనేక ఇతర అలవెన్సులు ఉంటాయి. మీడియా కథనాల ప్రకారం ఒక IAS అధికారికి నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం వస్తుంది. అలాగే ఒక ఐఏఎస్ అధికారి క్యాబినెట్ సెక్రటరీ పదవికి చేరుకుంటే అతనికి నెలకు దాదాపు 2.5 లక్షల రూపాయల జీతం లభిస్తుంది.

జీతం కాకుండా IAS అధికారులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వివిధ పే బ్యాండ్‌ల కింద పోస్ట్ ప్రకారం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందిస్తారు. ఇందులో జూనియర్ స్కేల్, సీనియర్ స్కేల్, సూపర్ టైమ్ స్కేల్ వంటి పే బ్యాండ్‌లు ఉంటాయి. బేసిక్‌ జీతం, గ్రేడ్ పే కాకుండా ఒక IAS అధికారి హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ పొందుతారు. పే-బ్యాండ్ ఆధారంగా ఐఏఎస్ అధికారులకు ఇల్లు, వంట మనిషి, గృహ సిబ్బందితో సహా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగంలో భాగంగా ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అక్కడ కూడా ప్రభుత్వ గృహం కేటాయిస్తారు. ఇది కాకుండా ఎక్కడికైనా ప్రయాణించడానికి కారు, డ్రైవర్ అందుబాటులో ఉంటారు.

Tags:    

Similar News