గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ దుర్మరణం
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చికెన్ కర్రీతో భోజనం చేస్తుండగా ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ దుర్మరణం
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చికెన్ కర్రీతో భోజనం చేస్తుండగా ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన పాటి సురేందర్ (42) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఆయన చికెన్ తీసుకొచ్చి ఇంట్లో వండమని చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చికెన్ కూరతో అన్నం తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది.
ఆ ముక్కను చేతితో తీసేందుకు సురేందర్ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమవడంతో పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే సురేందర్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సురేందర్‌కు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆదారమైన వ్యక్తిని కోల్పోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.