Black Box: బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏంటి.? విమానం పేలినా ఇది సురక్షితంగా ఎలా ఉంటుంది.?
Black Box: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచిన విషయం తెలిసిందే.. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం మేఘాని ప్రాంతంలో కూలిపోయింది.
Black Box: బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏంటి.? విమానం పేలినా ఇది సురక్షితంగా ఎలా ఉంటుంది.?
Black Box: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచిన విషయం తెలిసిందే.. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం మేఘాని ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు మృతిచెందారు. విమానం కూలిన తర్వాత బలమైన పేలుడు సంభవించగా, ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగతో కమ్ముకుంది.
విమాన ప్రమాదంలో మొదట వెతికేది ఏంటో తెలుసా?
ఎంత పెద్ద ప్రమాదం జరిగినా, దానికి గల కారణాల్ని కనుగొనడానికి బ్లాక్ బాక్స్ అనే పరికరం అత్యంత కీలకంగా ఉంటుంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు మొదట దీనికే ప్రాధాన్యత ఇస్తాయి. ఇది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) అనే రెండు భాగాలతో ఉంటుంది.
బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అవుతుంది?
బ్లాక్ బాక్స్‌లో కాక్‌పిట్‌లోని పైలట్ల సంభాషణలు, విమాన నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన డేటా స్టోర్ అవుతుంది. విమానం ఎలాంటి పరిస్థితుల్లో కూలిపోయిందో ఈ డేటా ఆధారంగా తెలుసుకోవచ్చు. పైలట్లు చివరి నిమిషాల్లో మాట్లాడిన మాటలు కూడా ఇందులో సులభంగా రికార్డ్ అవుతాయి.
ప్రమాదం తర్వాత ఎవరు దర్యాప్తు చేస్తారు?
భారతదేశంలో విమాన ప్రమాదం జరిగినప్పుడు, దాని దర్యాప్తు కోసం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రత్యేకంగా బృందాన్ని నియమిస్తుంది. ఈ బృందం డీజీసీఏ పర్యవేక్షణలో పనిచేస్తూ బ్లాక్ బాక్స్‌ను కనుగొని, దాని డేటాను విశ్లేషిస్తుంది.
బ్లాక్ బాక్స్ ఎంత బలంగా ఉంటుంది?
విమాన ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైనా కూడా బ్లాక్ బాక్స్ మాత్రం దెబ్బతినదు. ఎందుకంటే ఇది టైటానియం పదార్థంతో తయారవుతుంది. దీనిని ఒక శక్తివంతమైన మెటల్ కేసింగ్‌లో భద్రంగా ఉంచుతారు. అంతే కాకుండా, ఇది 1100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.
బ్లాక్ బాక్స్‌ను ఎలా కనుగొంటారు?
బ్లాక్ బాక్స్‌లో లొకేటర్ బీకాన్ అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. ఇది 30 రోజుల పాటు నిరంతరం సిగ్నల్స్‌ను పంపుతుంది. విమానం నేలపై కూలినా, నీటిలో పడ్డా – ఈ బీకాన్ వల్ల దానిని గుర్తించడం సులభమవుతుంది. శిథిలాల్లోంచి లేదా నీటిలోంచి బయటికి తీసి, దాని డేటా ద్వారా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తారు.