Washing Machine: వాషింగ్ మిషిన్ సామర్థ్యాన్ని కిలోల్లో ఎందుకు కొలుస్తారు? దీని అర్థం ఏంటి..
Washing Machine: వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఎక్కువగా చూసే ఫీచర్లలో మొదటిది దాని సామర్థ్యం. ఇది సాధారణంగా కిలోలలో లెక్కిస్తారు. ఉదాహరణకు 6kg, 7kg, 8kg లాంటివి. కానీ ఈ ‘కిలో’ అర్థం ఏంటి అన్న దానిపై చాలా మందికి స్పష్టత ఉండదు.
Washing Machine: వాషింగ్ మిషిన్ సామర్థ్యాన్ని కిలోల్లో ఎందుకు కొలుస్తారు? దీని అర్థం ఏంటి..
Washing Machine: వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఎక్కువగా చూసే ఫీచర్లలో మొదటిది దాని సామర్థ్యం. ఇది సాధారణంగా కిలోలలో లెక్కిస్తారు. ఉదాహరణకు 6kg, 7kg, 8kg లాంటివి. కానీ ఈ ‘కిలో’ అర్థం ఏంటి అన్న దానిపై చాలా మందికి స్పష్టత ఉండదు. ఇంతకీ ఈ కిలోలు దేనిని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాషింగ్ మెషీన్ సామర్థ్యం అన్నది పొడి బట్టల బరువును సూచిస్తుంది. అంటే 7kg సామర్థ్యంతో ఉన్న యంత్రం అంటే, 7 కిలోల పొడి బట్టలను ఒక్కసారిగా ఉతకగలదని అర్థం. ఇది తడి అయిన బట్టల బరువు కాదు, నీటిని పీల్చుకున్న తర్వాత దుస్తుల బరువు పెరుగుతుందని తెలిసిందే.
7 కిలోల మిషిన్‌లో సగటున 2 జీన్స్, 2-3 షర్టులు, కొన్ని లోదుస్తులు, ఒక టవల్ వంటి వాటిని ఉతకడానికి వేయొచ్చు. అయితే ఇది దుస్తుల ఫాబ్రిక్, ఆకారంపై ఆధారపడి ఉంటుంది. భారీ వింటర్ బట్టలు మెషీన్‌ను త్వరగా నింపేస్తాయి. కెపాసిటీకి మించి బట్టలు ఎక్కువగా వేసి ఉతకడం వల్ల సమయం, విద్యుత్ ఆదా అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది యంత్రంపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది.
బట్టలు సరిగ్గా శుభ్రం కావు, మోటార్‌పై ఒత్తిడి పెరుగుతుంది, యంత్రం పని సామర్థ్యం తగ్గుతుంది, లాంగ్ టెర్మ్‌లో డామేజ్ అవుతుంది. అయితే తక్కువ లోడ్ వల్ల కూడా నష్టాలుంటాయి. తక్కువగా బట్టలు వేయడం వల్ల విద్యుత్, నీటి వినియోగం వృథా అవుతుంది. మెషిన్ సామర్థ్యాన్ని బట్టి సరైన పరిమాణంలో బట్టలు వేయాలి.
ఒక మెరుగైన లోడింగ్ పద్ధతి ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మీ వాషింగ్ మెషిన్ డ్రమ్‌ను మూడవంతులుగా విభజించాలి. ఒక భాగం దుస్తులకు, ఒక భాగం గాలికి, మిగిలిన భాగం నీటి/డిటర్జెంట్ ప్రవాహానికి
ఇలా ఉతకడం వల్ల మెషిన్ సమర్థవంతంగా పని చేస్తుంది.
సాధారణంగా పెద్ద కుటుంబం ఉన్నవారికి: 8-10 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ మంచిది ఒంటరిగా నివసించే వారు లేదా చిన్న కుటుంబాలకు: 6-7 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ సరిపోతుంది.