Trending: బాబు చాలా బిజీ.. ఎంతంటే ఆఫీసుకు వెళుతూ బైక్ పై షేవింగ్ చేసుకునేంత!
రోడ్డుపై షేవింగ్ చేసుకుంటూ బైక్ నడుపుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది
Trending Video (image from facebook video)
కొంతమందికి 24 గంటల సమయమూ సరిపోదు. వాళ్ళు ఏపని చేసినా.. అసలు పని చేసినా చేయకపోయినా సరే ఎప్పుడూ బిజీ అనే చెబుతుంటారు. కొంతమందికి పాపం టైం నిజంగానే సరిపోదు. పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు కదా! కొంతమందికి తలకు మించిన పనులుంటాయి.
కొంతమంది స్తూడెంట్స్ ఉదయం లేటుగా లేచి.. కాలేజీకి టైం అయిపోతుంటే బ్రష్ చేసుకుంటూ పరిగెత్తే సందర్భాలు మనకు గతంలో తెలుసు. చాలామందికి అలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. ట్రైన్ కి టైం అయిపోతే కారులోనే బట్టలు మార్చుకుని వెళ్లిన అనుభవము మనలో కొంతమందికి ఉండే ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ షేవింగ్ చేసుకుంటూ కెమెరాకు చిక్కాడు.
బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ తీరిగ్గా షేవింగ్ చేసుకుంటూ బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ సంఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూస్తే మీరు కూడా వామ్మో వీడేంట్రా బాబూ అనుకుంటారు.
వినోద్ జైషి అనే ఆయన తన ఫేస్ బుక్ ఎకౌంట్లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి బైక్ హ్యాండిల్ వదిలేసి మరీ స్పీడుగా వెళ్ళిపోతున్నాడు. అయితే రెండు చేతులతోనూ ఆటను షేవింగ్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు.
నిజానికి ఈ వీడియో ఏదైనా రీల్స్ చేయడానికి చేశారా? లేక నిజంగానే ఆ వ్యక్తి టైం లేక బైక్ మీద వెళుతూనే ఇలాంటి పనిచేశారా అనేది స్పష్టంగా తెలీదు. కానీ, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఎంత టైం లేకపోతే అదేం పనిరా బాబు అని కొంతమంది అంటున్నారు. రీల్స్ కోసం మరీ ఇలాంటి సాహసాలు చేయకండి.. మీకే కాదు రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ప్రాబ్లెమ్ అని చాలామంది అంటున్నారు.